ఇదిలా ఉండగా థాంక్యూ మూవీ విషయంలో నాగార్జున సైలెంట్ గా ఉండడం గురించి ఆసక్తికర కారణాలు వినిపిస్తున్నాయి. థాంక్యూ చిత్రానికి సపోర్ట్ గా నాగార్జున చిన్న ట్వీట్ కూడా చేయలేదు. ఇది నాగ చైతన్య మూవీ.. పైగా అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ మూవీ. అయినప్పటికీ నాగార్జున థాంక్యూ మూవీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.