చిరంజీవిని చంపాలనుకున్నారు.. విషప్రయోగం చేసింది ఎవరు?.. మురళీమోహన్ సంచలన కామెంట్స్ 

Published : Jul 24, 2022, 04:06 PM IST

చిరంజీవిపై విషప్రయోగం జరిగింది ఆయన్ని చంపాలనుకున్నారని మురళీ మోహన్ తెలియజేశారు. 80లలో జరిగిన కుట్రను ఆయన తాజాగా బయటపెట్టారు.

PREV
17
చిరంజీవిని చంపాలనుకున్నారు.. విషప్రయోగం చేసింది ఎవరు?.. మురళీమోహన్ సంచలన కామెంట్స్ 
Chiranjeevi

ప్రతి రంగంలో రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఒకడు ఎదుగుతుంటే వాడిని క్రిందకు ఎలా లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎందరో ఉంటారు. చిత్ర పరిశ్రమలో ఇవి తారా స్థాయిలో ఉంటాయి. హీరోలు హీరోయిన్స్ సాంకేతిక నిపుణుల మధ్య అనారోగ్యపూరిత పోటీ నెలకొని ఉంటుంది. సినిమాకు కీలకమైన హీరోల మధ్య నడిచే రాజకీయాలు ఒక్కోసారి విపరీత చర్యలకు దారితీస్తాయి.

27

అలాంటి కుట్ర నుండి చిరంజీవి(Chiranjeevi) తృటిలో తప్పించుకున్నారు. ఆయన ఏకంగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. 80లలో ఆయనపై విషప్రయోగం జరిగింది. చిరంజీవిని అంతమొందించాలన్న ప్రయత్నం చోటు చేసుకుంది. అప్పట్లో సంచలనంగా మారిన ఈ సంఘటన నిజమేనని నటుడు మురళీ మోహన్ తెలియజేశారు.

37

తాజా ఇంటర్వ్యూలో మురళీ మోహన్(Murali Mohan) ఈ సంఘటన గురించి పూర్తిగా వివరించారు.1988లో  ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మరణ మృదంగం షూటింగ్ మొదలైంది. చెన్నైలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా చిరంజీవిని చూడటానికి అభిమానులు ప్రతిరోజూ వస్తూ ఉండేవారు. చిరంజీవి షాట్ గ్యాప్ లో వాళ్ళను స్వయంగా కలిసి, పలకరించి తిరిగి షూటింగ్ లో పాల్గొనేవారు.

47

ఈ క్రమంలో ఒక రోజు అభిమానినంటూ  ఓ అజ్ఞాత వ్యక్తి కేక్ తీసుకొచ్చాడు. నా పుట్టినరోజు మీరు కేక్ తినాలి అంటూ... చిరంజీవిని ఇబ్బంది పెట్టాడు. అభిమాని కోరిక కాదనలేక చిరంజీవి అయిష్టంగానే కేక్ తిన్నారు. అనంతరం చిరంజీవి అక్కడ నుండి సెట్ కి వచ్చేశాడు. కేక్ తిన్న కాసేపటికి చిరంజీవి పెదాలు నీలం రంగులోకి మారడం సెట్స్ లో వారు గమనించారు. ఏదో జరిగిందని భావించి వెంటనే చిరంజీవి ఆసుపత్రికి వెళ్లారు.

57

చిరంజీవిపై విషప్రయోగం జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు రోజుల చికిత్స అనంతరం చిరంజీవి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు, అని మురళీ మోహన్ తెలియజేశారు. చిరంజీవి ఎదుగుదలను చూడలేక ఎవరో ఆయనపై విష ప్రయోగం చేసినట్లు మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు.

67
Chiranjeevi

అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనేది ఇప్పటికీ తెలియదు. చిరంజీవికి కేక్ తినిపించిన అజ్ఞాతవ్యక్తిని పోలీసులు పట్టుకున్నారా? అసలు చిరంజీవి ఫిర్యాదు చేశారా? అనే విషయాలు తెలియవు. టాలీవుడ్ వర్గాలకే తెలిసిన ఈ న్యూస్ పెద్దగా జనాల్లో స్ప్రెడ్ కాలేదు. ఎందుకంటే ఒకటి రెండు పేపర్స్ మాత్రమే ఈ న్యూస్ కవర్ చేసినట్లు సమాచారం.

77


1983లో విడుదలైన ఖైదీ చిత్రం చిరంజీవికి హీరోగా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కొండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఛాలెంజ్, గుండా, రుస్తుం, విజేత, రాక్షసుడు లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. వరుస హిట్స్ తో చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ఆయనపై విషప్రయోగం జరిగింది. 

click me!

Recommended Stories