నేడే కియారా-సిద్దార్థ్ మల్హోత్రా వివాహం... వీరి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తెలుసా!

Published : Feb 06, 2023, 12:15 PM ISTUpdated : Feb 06, 2023, 12:20 PM IST

కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా వివాహం జైసల్మేర్ సూర్య ఘడ్ ప్యాలస్ హోటల్ లో ఘనంగా జరుగుతుంది. బాలీవుడ్ సెలెబ్స్ ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కియారాతో సిద్దార్థ్ ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం...   

PREV
17
నేడే కియారా-సిద్దార్థ్ మల్హోత్రా వివాహం... వీరి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తెలుసా!
Image: Instagram

కియారా అద్వానీ ఫస్ట్ టైం ఒక పార్టీలో కలిశారు. ఆంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ షూటింగ్ వ్రాప్ అప్ పార్టీకి సిద్ధార్థ్ మల్హోత్రా హాజరయ్యారు. ఆ సందర్భంగా మొదటిసారి కియారాను సిద్దార్థ్ కలిశారు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. పోనే నంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి. లస్ట్ స్టోరీస్లో కియారా నటించిన విషయం తెలిసిందే. 

27
Image: Instagram

అలా మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్లారు. వీరి సఫారీ టూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే ఎఫైర్ రూమర్స్ మొదలయ్యాయి. అనంతరం షేర్షా మూవీలో కలిసి నటించారు. ఆ మూవీ సెట్స్ లో ప్రేమ మరింత ఘాడంగా తయారైంది.

37
Image: Instagram

సిద్ధార్థ్ మల్హోత్రాతో లవ్ ఎఫైర్ పై కాఫీ విత్ కరణ్ షోలో హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్నల వర్షం కురిపించారు. సిద్ధార్థ్ తో రిలేషన్ వార్తలపై నీ సమాధానం ఏమిటని కియారాను అడిగారు. 'ఆ వార్తలను నేను సమర్ధించను, అలాగే ఖండించను కూడా' అని కామెంట్ చేశారు. ఆయన నాకు మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. కియారా ఆ వ్యాఖ్యలతో ఎఫైర్ పై కొంత స్పష్టత ఇచ్చారు.

47
Sidharth Malhotra and Kiara Advani to get married

జనవరి 16న సిద్దార్థ్ మల్హోత్రా బర్త్ డే కాగా కియారా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరూ కలిసి ఉన్న అన్ సీన్ పిక్ షేర్ చేశారు. ఈ పోస్ట్ తో కియారా సిద్దార్థ్ తో రిలేషన్ పై దాదాపు క్లారిటీ ఇచ్చారు. 

57
Sidharth Malhotra and Kiara Advani to get married

గత రెండు నెలలుగా సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా వివాహం మీద  వార్తలు వస్తున్నాయి. ఇటీవల సైతం సిద్దార్థ్  కియారాతో పెళ్లి రూమర్స్ ని పరోక్షంగా ఖండించడం విశేషం. ఎట్టకేలకు నేడు పెళ్లి పీటలెక్కిన జంట అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. 

67
Sidharth Malhotra and Kiara Advani to get married

కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా వివాహం జైసల్మేర్ సూర్య ఘడ్ ప్యాలస్ హోటల్ లో ఘనంగా జరుగుతుంది. బాలీవుడ్ సెలెబ్స్ ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కియారాతో సిద్దార్థ్ ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం... 

77
Sidharth Malhotra and Kiara Advani to get married

ప్రస్తుతం కియారా రామ్ చరణ్ కి జంటగా ఆర్సీ 15 చేస్తున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో రామ్ చరణ్-కియారా కాంబోలో వినయ విధేయ రామ విడుదలైంది. మహేష్ కి జంటగా భరత్ అనే నేను చిత్రంలో నటించారు. కియారాకు తెలుగులో కూడా పాపులారిటీ ఉంది. 

click me!

Recommended Stories