కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?.. అభిమానుల డిమాండ్‌కి కారణమేంటి?

First Published | Aug 31, 2021, 8:18 PM IST

క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా త్వరలో మ్యారేజ్‌ చేసుకోబోతున్నారా? వీరిద్దరిని రియల్‌ లైఫ్‌లోనూ కపుల్‌గా చూడాలనుకుంటున్నారా? అభిమానుల `పెళ్లి` డిమాండ్‌కి కారణమేంటి? ఇంతకి వీరి పెళ్లి గోలేంటి? అనేది చూస్తే.. 
 

`కబీర్‌సింగ్‌`తో బాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషనల్‌గా మారింది కియారా అద్వానీ. ఈ అమ్మడు ఇటీవల సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. మాజీ ఇండియన్‌ ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బట్రా జీవితం ఆధారంగా, ఆయన శత్రువులతో చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

`షేర్షా` చిత్రానికి అటు అభిమానుల నుంచి, ఇటు చిత్ర వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. మరోవైపు విక్రమ్‌ బట్రా ఫ్యామిలీ సైతం ఈ సినిమాని బాగా ఇష్టపడుతున్నారు. సొంతంగా ప్రమోట్‌ చేస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా రన్‌ అవుతుంది. 
 


ఈ సినిమాలో కియారా, సిద్ధార్థ్‌ మధ్య కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. రొమాంటిక్‌ సన్నివేశాల్లోనూ వీరిద్దరు రెచ్చిపోయారు. మరోవైపు సినిమా ప్రమోషన్‌లోనూ క్లోజ్‌గా మూవ్‌ అవుతూ అందరి అటెన్షన్‌ని తమవైపు తిప్పుకున్నారు. 
 

రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరు ఇంతగా క్లోజ్ గా మూవ్‌ అవుతుండటంతో అభిమానులకు అనేక అనుమానాలు, ఆలోచనలు కలుగుతున్నాయి. సినిమాల్లో వీరిద్దరి మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు రక్తి కట్టడం, బయట కూడా ఫోటో షూట్లలోనూ చాలా దగ్గరగా ప్రవర్తించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
 

దీంతో అభిమానుల నుంచి ఓ డిమాండ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కియారా, సిద్ధార్థ్‌ మీరు రియల్‌లైఫ్‌లోనూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటున్నారు. అంతగా తెరపై మ్యాజిక్‌ చేశారని, బయట కూడా మ్యారేజ్‌ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాలీవుడ్‌ అభిమానులు. ఈ డిమాండ్‌ సర్వత్రా ఊపందుకుంది. 

మరి ఈ డిమాండ్‌కి ఈ క్రేజీ జోడీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా షూటింగ్‌ సమయంలో హీరోహీరోయిన్ల మధ్య పరిచయం స్నేహంగా మారుతుంది. అది మరింత క్లోజ్‌గా ఉండేందుకు దారి తీస్తుంది. 

సినిమా అయిపోతే ఎవరి దారులు వారైనా, ఆ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. మరికొందరు లవ్‌లోనూ పడతారు. మరి కియారా, సిద్ధార్థ్‌ ఇప్పటికే ప్రేమలో ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో వీరి మ్యారేజ్‌కి కూడా డిమాండ్‌ పెరగడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 

కియారా తెలుగులో `భరత్‌ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాల్లో నటించింది. దీంతోపాటు రామ్‌చరణ్‌- శంకర్‌ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. చాలా ఏళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుందీ బ్యూటీ.
 

ప్రస్తుతం కియారా `భూల్‌ భులైయ్యా 2`, `జగ్‌ జుగ్‌ జీయో`, `మిస్టర్‌ లేలే` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు తెలుగులోనూ పాగా వేసేందుకు ప్లాన్‌ చేస్తుంది.

Latest Videos

click me!