Kiara, Siddharth Malhotra: బాలీవుడ్ లో పెళ్ళికి రెడీ అయిన మరో యంగ్ కపుల్... త్వరలో శుభవార్త...

Published : Feb 26, 2022, 12:51 PM IST

బాలీవుడ్ లో లవ్ కపుల్ కామన్.. అందులో పెళ్లి పీటలవరకూ వచ్చినవారు.. బ్రేకప్ చెప్పుకుని విడిపోయిన వారు కూడా కామన్. ఇక త్వరలో మరో లవ్ కపుల్ పెళ్ళి పీటలు ఎక్కుతున్ననట్టు తెలుస్తోంది.

PREV
16
Kiara, Siddharth Malhotra: బాలీవుడ్ లో పెళ్ళికి రెడీ అయిన మరో యంగ్ కపుల్... త్వరలో శుభవార్త...

బాలీవుడ్‌ లో ఇప్పటికే పెళికి రెడీగా ఉన్నారు ఆలియా భట్,రణ్ భీర్ కపూర్. మంచి ముహూర్తం కోసం చూస్తన్న వీరు ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మధ్య కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్  కూడా సీక్రేట్ గా ప్రేమించుకుని ఈ మధ్యే పెళ్ళి బంధంతో ఒకటయ్యారు.  ఇక  మరో బాలీవుడ్ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు కూడా త్వరలో  మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది.

26

చాలా కాంగా వీరిద్దరు  డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. పైకి ఎప్పుడూ చెప్పకపోయినా.. వారి రిలేషన్‌ను  చాలా సీక్రేట్ గా  మెయింటేన్ చేస్తూ వచ్చారు.

36

ఎంత సీక్రేట్ గా ఉంచాలని చూసినా.. ఎక్కడో ఒక చోట బయట పడక తప్పదు. ఆ మధ్య కత్రీనా, విక్కీ కూడా సీక్రేట్ గా మెయిన్ టేన్ చేయాలి అని చూసి దొరికి పోయినట్టే.. వీళ్లిద్దరూ కూడా కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి.  

46

ఈ మధ్య బాలీవుడ్‌ ప్రేమ జంటలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న ఈ టైమ్ లో  సిద్ధార్థ్‌-కియారాలు కూడా  ఏడడుగులు వేయాలని నిర్ణయించకున్నట్టు తెలుస్తోంది. ఇలాగే సీక్రేట్ రిలేషన్ మెయింటేన్ చేస్తూ.. గాసిప్ లకు ప్లేస్ ఇచ్చే కంటే.. పెళ్లి చేసుకుని ఏం చక్కా ఎవరి పని వారు హాయిగా చేసుకుందాం అని అనుకున్నారట ఈ కపుల్.

56

అయితే ఇప్పటివరకు తమ రిలేషన్‌పై నోరు విప్పని ఈజంట విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ల తరహాలోనే సీక్రెట్‌ వేడ్డింగ్‌కు ప్లాన్‌ చేసుకుంటున్నారని వినికిడి. ఇదిలా ఉంటే కియారా-సిద్ధార్థ్‌లు కలిసి చేసింది ఒక్క సినిమానే. దీంతో తెరపై వీరి కెమిస్ట్రీ చూసి చూడ చక్కని జంటని అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఇక వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయని తెలుస్తోంది.

66

దాదాపుగా 2022 మిడిల్ లో లేదా, ఏడాది చివరిలో వీరిద్దరి పెళ్లికి పెద్ద వాళ్లు ప్లాన్‌ చేసుకుంటున్నారట. ఈ లవ్‌బర్డ్స్‌ ఈ విషయాన్ని త్వరలో అనౌన్స్ చేస్తారు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.  మరి ఈ వార్తలపై కియారా-సిద్ధార్థ్‌లు ఎలా స్పందిస్తారనేదికూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.

click me!

Recommended Stories