తెలుగులోకి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ , హీరో ఎవరంటే...

First Published | Aug 6, 2024, 3:14 PM IST

 అక్టోబర్ చివర్లో రెగ్యులర్ షూట్ మొదలు కానుందని, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఖుషీని


అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న  నటి శ్రీదేవి కుమార్తెలు తెలుగు ఇండస్ట్రీలో బిజీ కానున్నారు. ఇప్పటికే పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) కూడా ఇదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.


శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కూపర్ ఆల్రెడీ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. దేవర చిత్రం రిలీజ్ కు రెడీ గా ఉంది. కొరటాల శివ వంటి స్టార్ డైరక్టర్, పెద్ద బ్యానర్, ఎన్టీఆర్ కాంబోలో చేయటంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమా తర్వాత జాహ్నవి ..రామ్ చరణ్ తో చేయనుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని చిత్రాలు సైతం వరసలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చెల్లిలు ..శ్రేదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా తెలుగులోకి రోబోతున్నట్లు వినికిడి.



టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ నటవారసత్వాన్ని కొనసాగించే నందమూరి మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja)సినిమా ఖరారు అయ్యిందని, అందులో హీరోయిన్ గా ఆమెను ఎంచుకున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమాకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరక్షన్ చేయనున్నారు. ప్రస్తుతం టాక్స్ ప్రారంభ దశలోనే ఉన్నాయి. 
 


సెప్టెంబర్ 1 న  మోక్షజ్ఞ  చిత్రం ఎనౌన్సమెంట్ వస్తుందని, సెంప్టెంబర్ 6 న సినిమా లాంచింగ్ గ్రాండ్ గా చేస్తారని అంటున్నారు. అక్టోబర్ చివర్లో రెగ్యులర్ షూట్ మొదలు కానుందని, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఖుషీని తెలుగులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదని అంటున్నారు. 
 


 మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడా అని ఆయన అభిమానులతో పాటు, ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై రూమర్లు వచ్చిన అవేవీ నిజం కాలేదు. గతంలో ఈ విషయంపై బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞపై తనకు చాలా ఆశలున్నాయని, తాను దర్శకత్వం వహించే ‘ఆదిత్య-369’ సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పినా, దానిపై తర్వాత ఎటువంటి వార్తలు రాలేదు. ఏదైమైనా తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం  సక్సస్ ఫుల్ యువదర్శకుడు ప్రశాంత్ వర్మను రంగంలోకి దించటంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు. 

బాలకృష్ణ- ప్రశాంత్ వర్మల మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆహా అన్ స్టాపబుల్ షోకు ప్రశాంత్ వర్మనే డైరెక్టర్ గా వ్యవహరించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను కూడా ప్రశాంత్ వర్మ చేతుల్లోనే పెట్టాడని తెలుస్తోంది.

 ఆ మధ్యన తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అలాగే.. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని మరో ట్వీట్‌ చేశాడు. తాజాగా తన డెబ్యూ మూవీపై మరో అప్ డేట్ ఇచ్చాడు బాలయ్య వారసుడు. ఇందులో తన సినిమా షూట్ కూడా స్టార్ట్ పోయినట్లు చెప్పుకొచ్చాడు. ‘ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్, అన్ని మీ అంచనాలను మించి ఉంటాయి’ అని ట్వీట్ చేశాడు మోక్షజ్ఞ. ఈ పోస్టుకు హైఫై, బ్లాస్ట్, ఫైర్ ఏమోజీలు జత చేశాడు. అలాగే తన పోస్టకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కూడా ట్యాగ్ చేశాడు

గతంలో చాలా బొద్దుగా కనిపించిన అతను తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం. వీటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 

Latest Videos

click me!