నాగచైతన్య బాలీవుడ్‌ ఆశలపై `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ నీళ్లు.. చివరికి నలిగిపోవడమేనా?

Published : Jan 21, 2022, 07:57 PM IST

అక్కినేని హీరో నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు పెద్ద ప్రాజెక్ట్ ని ఎంచుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఆశలను `కేజీఎఫ్‌` హీరో యష్‌ దెబ్బ కొట్టబోతున్నారు. 

PREV
16
నాగచైతన్య బాలీవుడ్‌ ఆశలపై `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ నీళ్లు..  చివరికి నలిగిపోవడమేనా?

నాగచైతన్య ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. `లవ్‌ స్టోరి`తోపాటు సంక్రాంతికి `బంగార్రాజు`తో సక్సెస్‌ కొట్టారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు `థ్యాంక్యూ`తోపాటు హిందీలో అమిర్‌ ఖాన్‌తో `లాల్‌ సింగ్‌చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ అధికారికగా కీలక పాత్ర పోషిస్తున్నారు నాగచైతన్య. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.

26

ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు నాగచైతన్య. తొలి చిత్రంతోనే బాలీవుడ్‌ మార్కెట్‌లో పాగా వేయాలని భావిస్తున్నారు. గతంలో నాగార్జున సైతం ఇలా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రాల జోరుపెరగడం, తెలుగు చిత్రాలకు హిందీలో మంచి మార్కెట్‌ ఏర్పడటంతో నాగచైతన్య సైతం తన మార్కెట్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

36

ఇదిలా ఉంటే నాగచైతన్యకి రాకింగ్‌ స్టార్‌ యష్‌ రూపంలో దెబ్బ పడబోతుంది. యష్‌ హీరోగా నటించిన `కేజీఎఫ్‌ 2` చిత్రం విడుదల కాబోతుంది. ఇది ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. తొలి భాగం భారీ విజయాన్ని సాధించింది. తెలుగుతోపాటు హిందీలోనూ ఇది తన హవా చూపించింది. ఇప్పుడు రెండో భాగంలో బాలీవుడ్‌నటులు సంజయ్‌దత్‌, రవీనా టండన్‌ నటిస్తున్నారు. దీంతో ఈ సారి బాలీవుడ్‌లో ఈ సినిమా హవా గట్టిగానే ఉండబోతుంది. పైగా ఇటీవల `పుష్ప` అక్కడ భారీ విజయాన్నిసాధించింది. దీంతో ఇలాంటి యాక్షన్‌ చిత్రాలకు హిందీలో మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఇలా అక్కడ ఈ చిత్రం గట్టి ప్రభావాన్ని చూపించబోతుంది. 

46

`కేజీఎఫ్‌ 2` చిత్రం తెలుగులోనూ సత్తా చాటుతుంది. తొలి భాగం ఇక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఇలా తెలుగులోనూ `కేజీఎఫ్‌ 2` ఓ ఊపు ఊపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రకంగానూ చైతూ `లాల్‌సింగ్‌ చద్దా`కి అటు హిందీలో, ఇటు తెలుగులో ప్రభావం పబడోతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

56

మరోవైపు దళపతి విజయ్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ `బీస్ట్` సినిమా సైతం ఏప్రిల్‌ 14న టార్గెట్‌తో బరిలోకి దిగుతుంది. విజయ్‌ చిత్రాలు ఏకకాలంలో తెలుగులోనూ రిలీజ్‌ అవుతుంటాయి. అదే సమయంలో హిందీలోనూ రిలీజ్‌ చేస్తున్నారు. విజయ్‌కి తెలుగులో మార్కెట్‌ బాగానే ఉంది. పైగా ఇప్పుడాయన తెలుగులో సినిమా చేస్తున్న నేపథ్యంలో అది మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు విజయ్‌ సినిమాలు హిందీలోనూ రిలీజ్‌ అవుతుంటాయి. ఈ రకంగా ఇది `లాల్‌సింగ్‌చద్దా`ని ఇటు తెలుగులో, అటు హిందీలో దెబ్బ కొట్టేలా ఉన్నాయి. 

66

బాలీవుడ్‌లో సౌత్‌ సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి మూడు భారీ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో అమిర్‌ చిత్రం `లాల్‌సింగ్‌ చద్దా` బాగా ఉంటే ఓకే, లేదంటే ఆ సినిమాపై `కేజీఎఫ్‌ 2`, `బీస్ట్` చిత్రాల ప్రభావం చాలా ఉంటుందని, దాన్ని డామినేట్‌ చేస్తాయని అంటున్నారు నెటిజన్లు. ఇదే జరిగితే నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ తేలిపోయే ఛాన్స్ ఉందని ఇంటర్నెట్‌లో చర్చ మొదలైంది. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories