గత ఏడాది కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు. దీనితో కేతికకి మరోసారి నిరాశ తప్పలేదు. కేతిక శర్మ చివరగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రంలో నటించి మంచి అటెన్షన్ కొట్టేసింది. అయితే బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.