స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో రీతూ బ్యూటీఫుల్ లుక్.. శారీలో మెరిసిపోతున్న తెలుగు అందం..

First Published | Aug 3, 2023, 9:11 PM IST

 ‘పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూ వర్మ చీరకట్టులో మెరిసిపోతోంది.  బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. అదిరిపోయేలా ఫోజులిస్తూ తెలుగు బ్యూటీ కట్టిపడేస్తోంది. 

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma)  ముందు ‘బాద్షా’ తదితర వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 

హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిల్మ్ తో కాస్తా క్రేజ్ దక్కించుకుంది. అలా నటిగా అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత  హీరోయిన్ గా సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తోంది. 
 


ఇదిలా ఉంటే.. రీతూ వర్మ సోషల్ మీడియాలో ప్రస్తుతం యాక్టివ్ గా కనిపిస్తోంది. వీలైనప్పుడల్లా నెట్టింట సందడి చేస్తోంది. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో పాటు గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టు లో దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో తెలుగు అందం మరింతగా మెరిసిపోయింది. ఆకట్టుకునే శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఆకట్టుకుంది. గ్లామర్ మెరుపులు మెరిపించింది. స్టన్నింగ్ ఫోజులతోనూ అదరగొట్టింది.
 

ఇలా ఈ ముద్దుగుమ్మ పోస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోకు దూరంగా ఉండే రీతూ వర్మ.. సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తూ వీలైనంతగా మెరుపులు మెరిపిస్తోంది. స్టన్నింగ్ లుక్ లో కట్టిపడేస్తోంది. ఈ ముద్దుగుమ్మ నయా లుక్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. 
 

చివరిగా ఈ ముద్దుగుమ్మ  తెలుగులో శర్వానంద్ సరసన ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో అలరించింది. ప్రస్తుతం తమిళంలో ‘మార్క్ ఆంటోనీ’, ‘ధృవ నక్షత్రం’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. 

Latest Videos

click me!