కీర్తి సురేష్ 'విషు' సెలెబ్రేషన్స్ చూశారా.. బ్యూటిఫుల్ ఫొటోస్

First Published Apr 15, 2024, 12:32 PM IST

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

 మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. హోమ్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూనే, అవసరమైనప్పుడు గ్లామర్ గా కనిపిస్తోంది. 

 నేను శైలజ చిత్రంతో కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. 

కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. అనేక విజయాలు సొంతం చేసుకుంది. 

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఎల్లో డ్రెస్ లో మెరిసిన కీర్తి సురేష్ తన ఫోజులకు ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది. పండుగ వాతావరణం కనిపిస్తున్న చోట ఫోజులు ఇచ్చింది. 

ప్రస్తుతం కేరళ, తమిళనాడులో విషు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విషు అనేది అక్కడ కొత్త సంవత్సరం. కీర్తి సురేష్ కూడా విషు సెలెబ్రేషన్ ని ఘనంగా నిర్వహించింది. 

కీర్తి సురేష్ చివరగా దసరా, భోళా శంకర్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ మరో తెలుగు చిత్రానికి సైన్ చేయలేదు. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్ కి ఫిదా అవుతున్న నెటిజన్లు ఆమెకి విషు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

click me!