మల్టీ కలర్స్ షర్ట్ లో మతి పోగొడుతున్న కళావతి.. స్టన్నింగ్ స్టిల్స్, సెల్ఫీలతో కీర్తి సురేష్ అల్లరి.!

Published : Oct 13, 2022, 05:41 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) క్రేజీ ఫొటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. క్యాజువల్ లుక్ లోనూ అభిమానులను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.   

PREV
16
మల్టీ కలర్స్ షర్ట్ లో మతి పోగొడుతున్న కళావతి.. స్టన్నింగ్ స్టిల్స్, సెల్ఫీలతో కీర్తి సురేష్ అల్లరి.!

కేరీర్ ప్రారంభంలో ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిచ్చే ఈ బ్యూటీ ప్రస్తుతం ట్రెండీ వేర్స్ లోనూ కనువిందు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ గ్లామర్ విందు చేస్తూ మతిపోగొడుతోంది. 

26

‘మహానటి’తో జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న కీర్తి సురేష్ తెలుగు ఆడియెన్స్ కు కూడా ఎంతో దగ్గరైంది. నటన పరంగా దక్షిణాది ప్రేక్షకులతో  ఒకే అనిపించుకొని ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో వరుసగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. 
 

36

టెక్నీలజీ పెరుగుతున్న కొద్దీ అభిమానులు, ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యేందుకు సెలబ్రేటీలు నెట్టింట కూడా సందడి చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కీర్తి సురేష్ కూడా ఇంటర్నెట్ లో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. తాజాగా మరిన్ని న్యూ పిక్స్ ను పంచుకుంది. 
 

46

కీర్తి పంచుకున్న లేటెస్ట్ పిక్స్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. మల్టీ కలర్స్ షర్ట్ ధరించి, బ్లూ జీన్స్ లో స్టైలిష్ గా ఫొటోలకు పోజులిచ్చింది. వెస్ట్రన్ వేర్ లోనూ అదరగొట్టగలనని నిరూపించింది. క్యాజువల్ స్టిల్స్ లోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అలాగే సెల్ఫీతో అందాలను బంధిస్తూ ఫ్యాన్స్ ను  ఖుషీ చేస్తోంది.
 

56

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు నిత్యం ఇలా మెరుస్తోంది. ఇక ఇండస్ట్రీలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు కీర్తి కూడా గ్లామర్ షో చేయక తప్పడం లేదు.  
 

66

చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సరసన ‘దసరా’ (Dasara) మూవీలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లోనూ కీలక పాత్రలో అలరించనుంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలోనూ నటించగా.. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 

click me!

Recommended Stories