టాప్ మ్యూజిక్‌ డైరెక్టర్‌తో ప్రేమలో కీర్తిసురేష్‌.. త్వరలో పెళ్లి? నిజమెంత?

First Published | Feb 13, 2021, 11:25 AM IST

నేషనల్‌ అవార్డు విన్నర్‌ కీర్తిసురేష్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో ప్రేమలో ఉందా? త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? ప్రస్తుతం వీరి మధ్య మ్యారేజ్‌కి సంబంధించిన ప్రపోజల్‌ డిస్కషన్‌ జరుగుతుందా? అంటే అవునని తమిళ మీడియా అంటోంది. వీరి లవ్‌ ఎఫైర్‌,మ్యారేజ్‌ గురించిన కథనాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 
 

కీర్తిసురేష్‌ `మహానటి`తో భారీ పాపులారిటీని, గుర్తింపుని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. మహానటి సావిత్రి ఇలానే ఉంటుందేమో అనేంతగా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది.
అనంతరం పలు సినిమాలు చేసినా ఈ అమ్మడికి హిట్‌ తగలడం లేదు. వరుసగా పరాజయాలనే చవిచూస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా కీర్తిసురేష్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్ట్ న్యూస్‌ సోషల్‌ మీడియాలో, తమిళ మీడియాలో వినిపిస్తుంది.
ప్రస్తుతం కీర్తిసురేష్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది.
తమిళ బేస్డ్ పాపులర్‌ సౌత్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది.
వీరిద్దరు కలిసి మ్యారేజ్‌ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
గతేడాది అక్టోబర్‌లో అనిరుధ్‌ బర్త్ డే రోజు ఆయనతో కీర్తి చాలా క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది. లవర్‌లాగే పోజులిచ్చింది.
ఈ నేపథ్యంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనేది నిజమే అనే ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
కేవలం ఇది గాలి వార్తలేనా? లేక ఇందులో నిజం ఉందా? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై కీర్తిగానీ, అనిరుధ్‌గానీ స్పందిస్తేగానీ దీనిపై క్లారిటీ రాదు.
ప్రస్తుతం కీర్తిసురేష్‌.. మహేష్‌బాబుతో కలిసి `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో రజనీకాంత్‌తో కలిసి `అన్నాత్తే`లో, `గుడ్‌లక్‌ సఖీ`, `రంగ్‌ దే`, `వాషి`, `సాని కాయిదమ్‌`, `మరక్కర్‌ః అరవికడలింతే సింహాం` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Latest Videos

click me!