ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో భోళా శంకర్, దసరా చిత్రాలు చేస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న దసరా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఇక భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో రెండు తమిళ చిత్రాలు కీర్తి ఖాతాలో ఉన్నాయి.