Keerthy Suresh Photos: `గాంధారి` పాటకి స్టేజ్‌పై కిర్రాక్‌ స్టెప్పులు.. సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో అందాలు జిగేల్

Published : Feb 22, 2022, 09:39 AM ISTUpdated : Feb 22, 2022, 10:36 AM IST

కీర్తిసురేష్‌ క్యూట్‌గానే కాదు, హాట్‌ అందాలతోనూ కనువిందు చేస్తానని నిరూపిస్తుంది. తాజాగా ఆమె స్టేజ్‌పైన చేసిన రచ్చ చేసింది. తాను నటించిన `గాంధారి` పాటకి కిర్రాక్‌ స్టెప్పులేస్తూ పిచ్చెక్కిచ్చింది కీర్తిసురేష్‌.   

PREV
112
Keerthy Suresh Photos: `గాంధారి` పాటకి స్టేజ్‌పై కిర్రాక్‌ స్టెప్పులు.. సిల్వర్‌ కలర్‌ డ్రెస్‌లో అందాలు జిగేల్

కీర్తిసురేష్‌.. ఫస్ట్ టైమ్‌ ఓ వీడియో సాంగ్‌ చేసింది. `గాంధారి` అంటూ సాగే ఈ వీడియో ఆల్బమ్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ పాటకి బృందా మాస్టర్‌ కొరియోగ్రఫీతోపాటు, దర్శకత్వం వహించారు. పాట ఆవిష్కరణ ఈవెంట్‌లో కీర్తిసురేష్‌ స్టేజ్‌పైన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ వేర్‌లో ఆమె ఓ వైపు హోయలు పోతూ అభిమానులను పిచ్చెక్కిస్తుంది. 

Keerthy Suresh glamoure Photos. 

212

సిల్వర్‌ కలర్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌ ధరించి కనువిందు చేసింది కీర్తిసురేష్‌. జిగేల్‌మనే అందాలతో చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కీర్తిసురేష్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

Keerthy Suresh glamoure Photos. 

312

ఇక `గాంధారి.. గాంధారి.. నీ మరిది ..గాంధారి` అంటూ సాగే ఈ పాటని సుద్దాల అశోక్‌ తేజ రాయగా, అనన్య భట్‌ ఆలపించారు. పవన్‌ సిహెచ్‌ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. అయితే ఈ సాంగ్‌లో కీర్తి చేసిన డాన్సులు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఓ రకంగా సింగిల్‌ వీడియో సాంగ్‌ ట్రెండ్‌కి టాలీవుడ్‌లో కీర్తి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. 

Keerthy Suresh glamoure Photos. 

412

 కీర్తిసురేష్‌ ప్రస్తుతం బిజీ హీరోయిన్‌. ఆమె మహేష్‌బాబుతో కలిసి `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తుంది. కళావతి పాత్రలో ఆమె కనిపించబోతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ పాట మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. 

Keerthy Suresh Dance at Gandhari song release event.

512

ఇందులో శారీలో కనిపించినా యమ హాట్‌గా ఉంది కీర్తిసురేష్‌. చీరలోనూ ఆమె అందాలు రెట్టింపయ్యాయని చెప్పొచ్చు. ఆమె అభిమానులు కూడా ఇలా చూసిన కనువిందుగా ఫీల్‌అవుతుంది. అందం పొట్టి బట్టల్లో కాదు, కనువిందైన చీరకట్టులో ఉందని కామెంట్లు చేస్తుండటం విశేషం. 
Keerthy Suresh Dance at Gandhari song release event.

612

 `నేను శైలజ` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ కెరీర్‌ ఇప్పుడు రాంగ్‌ ట్రాక్‌ ఎక్కినట్టు వార్తలొస్తున్నాయి. `మహానటి`తో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆమె ఆ తర్వాత సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంలో విఫలమవుతుంది. 

Keerthy Suresh Dance at Gandhari song release event.

712

`మహానటి` తర్వాత కీర్తిసురేష్‌ నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలన్నీ పరాజయం చెందాయి. `పెంగ్విన్‌`, `మిస్‌ ఇండియా`, `గుడ్‌లక్‌ సఖీ`, `రంగ్‌దే` చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. కీర్తిసురేష్‌ స్థాయి సినిమాలు కావనే కామెంట్స్ క్రిటిక్స్ నుంచి వినిపించింది. 
Keerthy Suresh Dance at Gandhari song release event.

812

ఈ రకంగా కీర్తి కెరీర్‌ డౌన్‌ఫాల్‌ అవుతున్న నేపథ్యంలో మరో మిస్టేక్‌ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె అగ్ర హీరోలకు చెల్లెలి పాత్రలు పోషించడం సరైన నిర్ణయం కాదంటున్నారు. రజనీకాంత్‌ నటించిన `అన్నాత్తే` చిత్రంలో ఆయనకు చెల్లిగా నటించింది కీర్తి. 

Keerthy Suresh Dance at Gandhari song release event.

912

అలాగే ఇప్పుడు తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న `భోళాశంకర్‌`లోనూ చెల్లిగా చేస్తుంది. ఈ టైమ్‌లో చెల్లిగా చేస్తే హీరోలు ఆమెని కథానాయికగా తీసుకోవడానికి ఆసక్తి చూపరనే టాక్‌ వినిపిస్తుంది. ఇది నటిగా కీర్తి కెరీర్‌కి పెద్ద సవాల్‌తో కూడిన విషయంగా భావిస్తున్నారు. 
 

1012

అయితే పెద్ద హీరోలతో పనిచేసే అవకాశం రావడంతో కాదనకుండా చేసింది కీర్తి. రజనీకాంత్‌, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో సినిమా అంటే చేసేందుకు ఏ హీరోయిన్‌ కూడా వెనకాడరు. కీర్తిసురేష్‌ కూడా అదే చేసింది.కానీ చెల్లిగా చేయడమే ఇక్కడ సమస్యగా మారింది. 
 

1112

మరి సవాళ్లతో, ప్రయోగాలతో కూడిన కీర్తిసురేష్‌ కెరీర్‌ సరైన ట్రాక్‌లోనే వెళ్తుందా? రాంగ్‌ ట్రాక్‌ కొనసాగబోతుందా? అనేది వేచి చూడాలి. కానీ కీర్తి ఇలా వరసగా ప్రయోగాలతో అభిమానులను ఒకింత సర్‌ప్రైజ్‌ చేయడంతోపాటు ఆందోళనకి గురి చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

1212

ప్రస్తుతం కీర్తిసురేష్‌ తెలుగులో `సర్కారు వారి పాట`, `భోళాశంకర్‌` చిత్రాలతోపాటు నానితో మరోసారి `దసరా` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో మలయాళంలో `వాసి`, తమిళంలో `సాని కయిదమ్‌` చిత్రాల్లో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories