ఏమి చేయలేక కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతారు రాహుల్, రుద్రాణి. అప్పుడు స్వప్నని కోపంగా రూమ్ లోకి తీసుకువెళ్లి నువ్వు ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డావో తెలుసా.. మర్యాదగా నిజం చెప్పే లేదంటే మోసం చేసాం అనుకుంటారు నీతో పాటు నన్ను అమ్మ వాళ్ళని కూడా కలిపి అపార్థం చేసుకుంటారు. నిజం చెప్తే కనీసం సానుభూతి అయినా మిగులుతుంది అంటుంది కావ్య. అలా చేస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వరు అంటుంది స్వప్న.