ఆ మధ్య ఏకంగా రోకా ఫంక్షన్ జరిగిందంటూ వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. దీన్ని ఖండిస్తూ, ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు మ్యారేజ్‌కి సిద్ధమయ్యారని, ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మ్యారేజ్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. రేపటి వరకు పెళ్లి వేడుక జరుగనుందని, ఈ నెల 11 న తిరిగి ముంబయి చేరుకుంటారని సమాచారం. ఆ తర్వాత ముంబయిలో ఓ గ్రాండ్ రిసెప్షన్‌ని కూడా ప్లాన్ చేశారట విక్కీ-కత్రినా జంట. సినిమా సెలబ్రిటీలు, బంధువులను ఆహ్వానించి విందుని ఇవ్వనున్నారట. మొత్తానికి ఇద్దరి ప్రేమికుల తర్వాత కత్రినా.. విక్కీని మ్యారేజ్ చేసుకోవడం విశేషం.