విజయ్ దేవరకొండ- రష్మిక, ప్రభాస్-అనుష్క, చైతూ‌- శోభిత, సిద్దార్ధ్-అతిధి వీళ్లు ప్రేమలో ఉన్నారా..?

First Published | Dec 2, 2023, 11:25 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిల్లు కామన్.. లవ్ రూమర్స్ కూడా కామన్.. అయితే కొంత మంది స్టార్స్ ఉంటారు.. వాళ్లు ప్రేమించుకుంటుననారు అని వార్తలు వస్తాయి.. వాటిని ఖండించరు.. అలా అని కన్ ఫార్మ్ చేయరు.. కాని అందులో కొన్ని జంటలు మాత్రం కలిసి తిరుగుతూ.. ఆడియన్స్ ను కన్ ఫ్యూ్జ్ చేస్తుంటారు. మరి అలాంటి జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..?
 

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలు చాలా కామన్. కొంతమంది వారు నటించిన హీరోలతోనే ప్రేమలో పడిపోతారు. కొంత మంది పెళ్లి వరకూ వెళ్తే మరికొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటుంటారు. కాని కొంతమంది మాత్రం ప్రేమలో ఉన్నా లేనట్టు.. లేకున్నా ఉన్నట్టు వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ. క్లారిటీ లేకుండా నడుస్తున్న హీరోహీరోయిన్ల ప్రేమ కథలు ఫిల్మ్ ఇండస్ట్రీలో బోలెడు ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక... సిద్దు ,అతిధి లాంటి జంటలు తమ ప్రేమపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వంలేదు. 
 

సినిమాలతోనే కాదు..ఆడియన్స్ తో కూడా ఆటాడేసుకుంటున్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరో తనతో రెండు సినిమాలు చేసి.. ఓ సారి ఘాటు రొమాన్స్ కూడా చేసుకున్న రష్మిక మందన్నతో ప్రేమలో ఉన్నట్టు వార్తలుతెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరు డేటింగ్ చేసుకుంటున్నట్టు కొన్నిసాక్ష్యాలు కూడా బయటకువచ్చాయి. రీసెంట్ గా ఎన్నికల వేళ కూడా.. ఈ ఇద్దరు ఒకే రకం రౌడీ వేర్ డ్రెస్ లో కనిపించారు.. ఓసారి మాల్దీవ్స్ కు కూడా వెళ్లినట్టు నెటిజన్లు కనిపెట్టారు. ఒకే లొకేషన్ లోవిడివిడిగా ఫోటోలుపెట్టి దొరికిపోయారు జంట. కాని ఇద్దరిలో ఎవరూ.. వీరి ప్రేమకుసబంధించిన వార్తలను ఖండించరు.. అలా అని కన్ ఫార్మ్ చేయరు. 


ఇక ఇలా కలిసి తిరుగుతూ కామ్ గా  ఉన్న జంటల్లో నాగచైతన్య‌- శోభిత దూలిపాళ  కూడా ఉన్నారు. సమంతతో డివోర్స్ తరువాత చైతూ చాలా కాలం కామ్ గా ఉన్నారు. ఆతరువాత శోభితతో ప్రేమలో పడ్డట్టుతెలుస్తోంది. ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని ఫారెన్ లో తిరుగుతున్న ఫోటో కూడా ఒకటి వైరల్ అయ్యింది. అంతే కాదు నాగచైతన్య ప్లాట్ ముందు శోభిత కారు ఉండటం కూడా అప్పట్లో హైలెట్ అయ్యింది. కాని ఈ విషయంలో ఇద్దరు ఈ వార్తలను ఖండించలేదు. ఓటైమ్ లో ఇరుకుటుంబాలు ఒప్పుకున్నాయి.. పెళ్ళి చేసుకోబోతున్నారు అని కూడా వార్తలు వచ్చాయి.  తప్పక చైతూ ఓసారి ఈ వార్తలపై స్పందించారు. ప్రస్తుతానికి సినిమాలే తన ప్రపంచం అన్నారు. 
 

హీరో సిద్ధార్థ్ తో అదితి రావు హైదరి ప్రేమలో ఉందంటూ అనేక రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు వీరిద్దరు కలిసి తిరుగుతున్నారు. శర్వానంద్ పెళ్లికి కూడా ఇద్దరు కలిసి వచ్చారు.. ఎటు వెళ్ళినా జంటగా వెళ్తున్నారు. దాంతో ఇద్దరు ప్రేమ మాత్రమే కాదు.. ఏకంగా సహజీవనమే స్టార్ట్ చేశారు అని వార్తలు వచ్చాయి. కాని ఈ విషయంలో ఇద్దరు స్పందించరు.. ఖండించరు. కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ.. జనాలను అయోమయంలో పడేస్తుంటారు. త్వరలో  వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Prabhas – Anushka

ఇక ప్రభాస్-అనుష్కల ప్రేమ కహానీ ఇప్పటిటిది కాదు.. జమానాలో స్టార్ట్ అయ్యాయి ఈ వార్తలు ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్బ బ్యాచిలర్లలాగానే మిగిలిపోయారు. ఇద్దరికి వయస్సు 40 దాటింది. ప్రభాస్ 44 లో  ఉన్నారు.. అనుష్క 41 లో ఉంది. అయినా సరే ఇద్దరు పెళ్ళి చేసుకోవడం లేదు. దాంతో అంతా వీరు ప్రేమలో ఉన్నట్టు ఫిక్స్ అవుతున్నారు. అంతే కాదు అమెరికాలో ఓ ఇల్లు కూడా కొన్నట్టు అప్పట్లో రూమర్లు వచ్చాయి. అయితే ఈమధ్య  వీరి ఫ్యాన్స్.. వీరిద్దరు ఇక పెళ్ళి చేసుకోరు అని ఫిక్స్ అయినట్టు ఉన్నారు..  ప్రభాస్, అనుష్కల  పెళ్ళి చేసి.. పిల్లలు కూడా పుట్టినట్టు.. గ్రాఫిక్ ఎడిటింగ్ చేసుకుని ముచ్చట పడుతున్నారు. కాని ఈ విషయంలో ప్రభాస్, అనుష్క ఇద్దరూ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.

చాలా సార్లు హైలెట్ అయిన ప్రేమ కథ.. రెజీనా, సాయి ధరమ్ తేజ్ లది.  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ - రెజీనా ప్రేమించుకున్నారని అప్పట్లో వార్తలు వైరల్అయ్యాయి. కాని  రెజీనా నచ్చకపోవడంతో మెగా కుటుంబసభ్యులు రెజీనాను రిజెక్ట్ చేశారట. ఇది సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు మాత్రమే. 

ఇక రీసెంట్ గానే హీరోయిన్ లావణ్యను ప్రేమించి పెళ్ళాడాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వీరు పెళ్ళి చేసుకునేంత వరకూ .. ఎవరికీ ఈ విషయంలో క్లారిటీ లేదు. సడెన్ గా చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక వైష్ణవ్ తేజ్ రీతూ వర్మను ప్రేమిస్తున్నాడని..మరికొంత మంది జంటలపై కూడా ఇలానే ప్రేమ రూమర్లు గట్టిగానడుస్తున్నాయి. మరి ఇందులో ఎంత మంది పెళ్లి పీటల వరకూ వస్తారో చూడాలి.  

Latest Videos

click me!