Vicky Kaushal : ఇన్ స్టా గ్రామే తనను ఫాలో అవుతోంది.. ఇండియాలోనే ఏకైక హీరో విక్కీ కౌశల్!

Published : Dec 25, 2023, 08:06 PM ISTUpdated : Dec 25, 2023, 08:13 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal)  కు ఇన్ స్టా గ్రామ్ నుంచి అరుదైన గౌరవం లభించింది. దాంతో అలాంటి గుర్తింపు పొందిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. 

PREV
16
Vicky Kaushal : ఇన్ స్టా గ్రామే తనను ఫాలో అవుతోంది.. ఇండియాలోనే ఏకైక హీరో విక్కీ కౌశల్!

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) భర్తగా గుర్తింపు ఉంది. సౌత్ లో కత్రినాకూ క్రేజ్ ఉండటం విశేషం. ఇలా సౌత్ లోనూ ప్రేక్షకులు అతన్ని ఫాలోఅవుతుంటారు. 

26

అయితే Vicky Kaushal బాలీవుడ్ లో చాలానే సినిమాలు చేశారు. విభిన్నపాత్రలు పోషించారు. తను నటించే పాత్రలకు వందశాతం తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం కసరత్తులు కూడా చేస్తుంటారు. 

36

ఇక రీసెంట్ గానే షారుఖ్ ఖాన్ ‘డంకీ’ Dunki  మూవీతో కీలకపాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

46

సాధారణంగా ఇన్ స్టా గ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవుతుంటారు. ఇక సెలబ్రెటీల విషయానికొస్తే మిలియన్లలో ఫాలోవర్స్ ఉంటారు. అటు స్టార్స్ కూడా కొద్దిమందిని ఇన్ స్టాలో ఫాలో చేస్తుంటారు. అయితే ఇన్ స్టా గ్రామే మనల్ని ఫాలోవడం ఇంత వినలేదు. 

56

ఇక విక్కీ కౌశల్ విషయంలో అచ్చంఅలాగే జరిగింది. ఏకంగా ఇన్ స్టా గ్రామే తనను ఫాలో బ్యాక్ చేసింది. ఇలా ఇన్ స్టా గ్రామ్ ఫాలోవున్న హీరోల్లో ఇండియాలోనే విక్కీ కౌశల్ ఏకైక హీరో కావడం విశేషం. దీంతో ఆయనకు ఇన్ స్టా నుంచి అరుదైన గౌరవం లభించింది. 

66

విక్కీ కౌశల్ కు ఇన్ స్టాలో 16.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అతను 416 మందిని ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు 1,613ల పోస్టులు చేశారు. సినిమాల విషయానికొస్తే.. చివరిగా ‘సామ్ బహదూర్’తో మంచి సక్సెస్ అందుకున్నారు. డంకీలో స్పెషల్ అపీయరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ‘మేరే మెహబూబ్ మేరే సనమ్’ చిత్రంలో నటిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories