బాడీ గార్డ్ కు కత్రీనా కైఫ్ అంత జీతం ఇస్తోందా..? ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...?

First Published | Oct 21, 2023, 10:49 AM IST

స్టార్ సెలబ్రిటీలంటే బాడీగార్డ్ లు కామన్. మరీముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా సొంత బాడీ గార్డ్ లను మెయింటేన్ చేస్తుంటారు. అంతే కాదు లక్షలకు లక్షలు జీతాలు కూడా ఇస్తుంటారు. తాజాగా స్టార్ బ్యూటీ కత్రీనా కైఫ్ బాడీగార్డ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా వరకూ సొంత సెక్యూరిటీని కలిగి ఉంటారు. వారికిలక్షల్లో జీతాలు కూడా ఇస్తుంటారు. ముఖ్యంగా కరీనా కపూర్, కత్రీనా కైఫ్, లాంటి సీనియర్ తారలో పాటు.. సల్మాన్, షారుఖ్, అమితాబ్ లాంటి వారికి సొంత సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా బాడీగార్డ్ లు ఎప్పుడూ వెంటే ఉంటూ.. వారిని రక్షిస్తుంటారు. 

రెండేళ్ల కిందనే 2021 లాక్ డౌన్ లో కత్రినా కైఫ్, బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కత్రినా సినిమాల్లో జోరు తగ్గించింది. మ్యారీడ్ లైఫ్ పై కొన్నాళ్లు ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించిన కత్రినా కైఫ్ భారీ చిత్రాల్లోనే నటిస్తోంది. ఎక్కు వ చిత్రాలకు సైన్ చేయకుండా పెద్ద సినిమాల్లోనే నటిస్తోంది. 


ప్రస్తుతం కత్రినా రెండు చిత్రాల్లో వర్క్ చేస్తోంది. కెరీర్ విషయానికొస్తే... గతేడాది ఈ ముద్దుగుమ్మ ఫోన్ బూత్ సినిమాతో ఆడియన్స్  ముందుకు వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన టైగర్3, మేరీ క్రిస్టమస్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. 
 

తాజాగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రీనా కైఫ్ బాడీ గార్డ్ కుసబంధించిన ఓన్యూస్ వైరల్ అవుతోంది.  40 ఏళ్లు దాటిన కత్రీనా జోరు ఏమాత్రం తగ్గేదు. పెళ్ళి తరువాత కూడా అదే బ్యూటీ మెయింటీన్ చేస్తూ... వయసు పైబడుతున్నా వరుస ఆఫర్లను సాధిస్తోంది. అంతే కాదు.  సినిమాకు దాదాపు పది నుంచి 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటోంది బ్యూటీ. 

ఇక ఈక్రమలో తనతో పాటు వెంటే ఉంటూ.. ఎక్కడికి వెళ్లినా తనను రక్షించే బాడీగార్డ్ కుసబంధించిన ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతోంది. . ఆమె బాడీగార్డ్ జీతం ఇప్పుడు వైరల్‌గా మారింది. కత్రినా కైఫ్  బాడీ గార్డ్ పేరు దీపక్ సింగ్. అతడి జీతం ఏడాదికి కోటి రూపాయలు అని సమాచారం. ఏది ఏమైనా కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కోసం ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు చేస్తోందంటే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

దీపక్ సింగ్ చాలా కాలంగా దీపక్ సింగ్ కత్రీనా దగ్గర పనిచేస్తున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంట అతను ఉంటాడు. ఎప్పుడూ కత్రీనాను రక్షిస్తూ ఉంటాడు. ఆమెతో మంచి ఫ్రెడ్షిప్ కూడా ఉంది అతనికి. కత్రినా కూడా దీపక్ ను తన దగ్గర పనిచేస్తున్న ఎంప్లయిలా కాకుండా.. ఇంట్లో మనిషిలా చూస్తుంది. 
 

దీపక్ సింగ్ కత్రీనాకు సబంధించిన ఎన్నో పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కత్రీనా మాత్రమే కాదు చాలా మంది స్టార్ల పరిస్థితి ఇదే.. స్టార్ సెలబ్రిటీగా కొనసాగితే ప్రజల్లోకి రావాలి అంటే ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చి బాడీ గార్డును కూడా సమకూర్చుకోవాల్సిందేనన్న వ్యాఖ్యలు కొందరి నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
 

Latest Videos

click me!