యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma) ప్రస్తుతం టాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది.
చిలసౌ, హిట్ : ది ఫస్ట్ కేస్, డర్టీ హరీ, నూటొక్క జిల్లా అందగాడు, హెర్ చాఫ్టర్ 1.... వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. వెండితెరపై విభిన్న పాత్రలతో అలరిస్తూ వస్తోంది.
వరుస చిత్రాలతో టాలీవుడ్ లో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేలా సినిమాలు చేస్తోంది. తను ఎంచుకునే కథలు, సినిమాల పట్ల కూడా శ్రద్ద వహిస్తోంది. ఆచీతూచీ అడుగేస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ అభిమానులను, నెటిజన్లను ఖుషీ చేస్తోంది. గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ మతులు పోగొడుతోంది. స్టన్నింగ్ పిక్స్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.
తాజాగా కొన్ని క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ట్రెండీ వేర్ లో బోర్లా పడుకొని కవ్వించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. చిలిపి ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. బ్యూటీఫుల్ స్మైల్ తో పడగొట్టింది. మత్తు చూపులతో మంత్రముగ్ధులను చేస్తోంది.
రుహానీ శర్మ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వగా.. హిందీలోనూ డెబ్యూ మూవీ ‘అగ్ర’లో నటిస్తోంది. తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్, ‘హిట్’ డైరెక్టర్ సైలేష్ కొలను - వెంకటేశ్ కాంబోలో వస్తున్న ‘సైంధవ్’లో హీరోయిన్ గా నటిస్తోంది.