అది గమనించి పవన్ సినిమా ఆపేసిన చిరంజీవి, లేకుంటే మెగా బ్రదర్స్ నవ్వులపాలు..కానీ డైరెక్టర్ కెరీర్ నాశనం

First Published | Oct 18, 2024, 4:52 PM IST

కాపుగంటి రాజేంద్ర ఎవరో కాదు బుల్లితెరని షేక్ చేసిన కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్. రాజేంద్ర అంతకు ముందు రెండు మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. 

చిత్ర పరిశ్రమలో దర్శకులుగా రాణించాలని చాలా మంది ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. అదృష్టం కొద్దీ కొందరికి అవకాశాలు వస్తుంటాయి. వాళ్లలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ గా ఎదిగేవారు చాలా తక్కువ. చాలా మంది దర్శకుల కెరీర్ అనేక కారణాల వల్ల రెండు మూడు చిత్రాలతోనే ఆగిపోతుంది. రాజమౌళి బుల్లితెర డైరెక్టర్ గా పనిచేసి మూవీ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియాని ఏలుతున్నారు. కానీ కాపుగంటి రాజేంద్ర అనే డైరెక్టర్ మాత్రం సినిమా నుంచి బుల్లితెరకు వెళ్లి అక్కడ రాణిస్తున్నారు. 

Chiranjeevi

కాపుగంటి రాజేంద్ర ఎవరో కాదు బుల్లితెరని షేక్ చేసిన కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్. రాజేంద్ర అంతకు ముందు రెండు మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఆయన కెరీర్ దురదృష్టవ శాత్తూ చిత్ర విచిత్రంగా సాగింది. రాజేంద్ర. దాసరి నారాయణ రావు దగ్గర శిష్యరికం చేశారు. తన కెరీర్ గురించి రాజేంద్ర మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చింది అల్లు అరవింద్ గారు. వాళ్ళ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో డబ్బు భలే జబ్బు అనే చిత్రం చేశా. అది రీమేక్ మూవీ. తమిళంలో కూడా గొప్పగా ఆడలేదు. తెలుగులో క్లైమాక్స్ మార్చి ట్రై చేద్దాం అని అల్లు అరవింద్ కోరితే నేను చేశాను. కానీ ఇక్కడ కూడా ఆ చిత్రం వర్కౌట్ కాలేదు. ఆ టైంలోనే మన కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుంది అని మాట ఇచ్చారు. 


అయితే సెకండ్ మూవీ గా ఎలాంటి కథ చేయాలి అనే చర్చ జరుగుతోంది. అప్పుడే ఒక పాయింట్ అనుకున్నాం. హీరోయిన్ ఇంట్లోకి హీరో ఫేక్ అల్లుడిగా వెళితే ఎలా ఉంటుంది ? అనే పాయింట్ తో కథ రాసుకున్నాం. ఈ కథని పవన్ కళ్యాణ్ తో చేద్దాం అని అల్లు అరవింద్ అన్నారు. పవన్ కళ్యాణ్ అప్పటికి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, గోకులంలో సీత చిత్రాలు పూర్తి చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా కథ పట్ల హ్యాపీ. మరోవైపు పవన్ తొలిప్రేమ షూటింగ్ లో  ఉన్నారు. 

కానీ నాగబాబు.. చిరంజీవితో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమానే బావగారు బాగున్నారా ?. ఈ చిత్రం వెంటనే షూటింగ్ ప్రారంభించారు. ఆ చిత్ర కథ అల్లు అరవింద్ కి అప్పుడు తెలిసింది. అందులో కూడా చిరంజీవి ఒక పెద్ద ఇంటికి ఫేక్ అల్లుడిగా వెళతారు. మిగిలిన కథ వేరైనప్పటికీ మెయిన్ పాయింట్ ఒకటే. దీనితో చిరంజీవి గారి ఆధ్వర్యంలో పంచాయతీ జరిగింది. నాగబాబు అప్పుడప్పుడే అంజనా ప్రొడక్షన్స్ సంస్థని డెవలప్ చేస్తున్నారు. నేను నా తమ్ముడు ఒకే కథ చేస్తే ఆడియన్స్ ఒప్పుకోరు. మీ కథ కూడా బావుంది. కాబట్టి ఎవరో ఒకరు డ్రాప్ అవ్వక తప్పదు. గీత ఆర్ట్స్ లో చాలా సినిమాలు వస్తున్నాయి. 

అంజనా ప్రొడక్షన్ కొత్త బ్యానర్ కాబట్టి మీరే డ్రాప్ అవ్వండి అని చిరంజీవి గారు చెప్పారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తో నేను చేయాల్సిన సినిమా ఆగిపోయింది. బావగారు బావున్నారా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో మార్పులు చేసి చేద్దాం అనే చర్చ కూడా జరిగింది కానీ వర్కౌట్ కాలేదు. ఆ విధంగా పవన్ తో తన చిత్రం ఆగిపోయింది అని కాపుగంటి రాజేంద్ర అన్నారు. ఆ తర్వాత నా కెరీర్ కష్టమైపోయింది.

సినిమా కష్టాలు అనుభవించా. కొన్నేళ్ల తర్వాత మోహన్ బాబు గారి నుంచి పిలుపు వచ్చింది. నీ దగ్గర కథ ఉందని తెలిసింది. నాతో చెయ్ అని అడిగారు. ఈ కథని మంచు విష్ణుతో చేద్దాం అనుకుంటున్నా అని చెప్పా. అంతకు ముందే రవిరాజా పినిశెట్టి ఆ కథని నాకు ఇవ్వు. నా డైరెక్షన్ లో సినిమా చేస్తా అని అడిగారు. అదే విషయాన్ని మోహన్ బాబు గారికి చెప్పా. వాళ్లిద్దరూ చర్చించుకున్నారు. 

ఇంతలోపు మోహన్ బాబు మరో కథని నా దగ్గరకు తీసుకువచ్చి.. దీనిని డైరెక్ట్ చేయి అని అడిగారు. అదే శివశంకర్ అనే చిత్రం. 70 శాతం షూటింగ్ పూర్తయింది. సాధారణంగా అయితే షూటింగ్ రోజుల్లో ఏ ఆర్టిస్ట్ కి మోహన్ బాబు పర్మిషన్ ఇవ్వరు. చాలాస్ట్రిక్ట్ గా ఉంటారు. రెండు రోజులు ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాలి అని సౌందర్య అడిగింది. ఆ రోజు మోహన్ బాబు నో అని చెప్పి ఉంటే సౌందర్య బ్రతికి ఉండేది. కానీ సౌందర్య కదా అని మోహన్ బాబు అనుమతి ఇచ్చారు. అప్పుడే ఆమె హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. నాకు సినిమాలు అచ్చిరావు అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ.

సౌందర్య మరణంతో క్లైమాక్స్ మొత్తాన్ని మార్చేసి కిచిడి కిచిడి చేయాల్సి వచ్చింది. కథ మొత్తం మార్చడం కుదరదు ఎందుకంటే ఆల్రెడీ 70 శాతం షూటింగ్ పూర్తయింది. దీనితో క్లైమాక్స్ మార్చి రిలీజ్ చేశాం. ఊహించినట్లుగానే ఆ చిత్రం డిజాస్టర్ అయింది అని కాపుగంటి రాజేంద్ర అన్నారు. సౌందర్య మరణంతో తన సినీ కెరీర్ పూర్తిగా నాశనం అయింది అని తెలిపారు. ఇక సినిమాలు మనకి వద్దు అని బుల్లితెర వైపు వచ్చినట్లు తెలిపారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన కార్తీక దీపం టివి సీరియల్ అత్యధిక టిఆర్పి రేటింగ్స్ తో సంచలనం సృష్టించింది. 

Latest Videos

click me!