`కార్తీక దీపం` ఫేమ్‌ వంటలక్కలో మరో యాంగిల్‌..రేంజ్‌ మామూలుగా లేదుగా..షాక్‌ అవుతున్న ఫ్యాన్స్

First Published Jan 24, 2021, 4:23 PM IST

`కార్తీక దీపం` సీరియల్‌ ఫేమ్‌ వంటలక్క ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే. ఆమెకి టీవీ రంగంలో విశేషమైన పాపులారిటీ ఉంది. ఇంకా చెప్పాలంటే స్టార్‌ హీరోయిన్ల రేంజ్‌ ఆమెది. చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లో, అమాయకంగా కనిపించే ప్రేమి విశ్వనాథ్‌ లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ట్రెండీగా కనిపించడంలో ఆమెని మించిన వారు లేరనే చెప్పాలి. అంతేకాదు ఆమె ఆస్తులు కూడా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యాయి. 

`స్టార్‌మా`లో `కార్తీక దీపం` సీరియల్‌ ప్రసారం అవుతుంది. అందులో వంటలక్క పాత్రలో మెస్మరైజ్‌ చేస్తుంది ప్రేమి విశ్వనాథ్‌.
undefined
మలయాళంకు చెందిన ప్రేమి విశ్వనాథ్‌ సీరియల్స్ ద్వారా పాపులర్‌ అయ్యింది. తెలుగులోకి రాకముందు ఆమె మలయాళంలోనూ మెప్పించింది.
undefined
ఏషియా నెట్‌ ఛానెల్‌లో ప్రసారం అయ్యే `కరుథముత్తు` అనే సీరియల్‌ ద్వారా కెరీర్‌ని ప్రారంభించింది విశ్వనాథ్‌. ఇందులో డార్క్ స్కిన్‌ రోల్‌లో ఆమె నటన మెస్మరైజ్‌ చేసింది. ఓ రకంగా ఆమెకి అదే కలర్‌ టోన్‌ కలిసొచ్చింది. `కథు` పాత్ర ఆమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.
undefined
ఇందులో ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఆ సీరియల్‌కే తన నటనతో మంచి గుర్తింపు తీసుకొచ్చారు ప్రేమి. దీంతోపాటు ఏషియానెట్‌ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో బెస్ట్ ఫీమేల్‌ లీడ్‌గా అవార్డుని కూడా సొంతం చేసుకుంది.
undefined
2014 నుంచి 17 వరకు ఏషియానెట్‌, ఫ్లవర్స్ టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించి మెప్పించింది.
undefined
`కార్తీక దీపం` సీరియల్‌తో 2017లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో దీప పాత్రలో, అలియాస్‌ వంటలక్కగా మంచి గుర్తింపు పొందింది. తెలుగులోనూ తిరుగులేని నటిగా ఎదిగింది. దీంతోపాటు స్టార్‌ మాలో ప్రసారమయ్యే `గోరింటాకు`, `చెల్లెలి కాపురం` సీరియల్స్ లోనూ దీప పాత్రలతో మెస్మరైజ్‌ చేస్తుంది. అయితే వీటిలో ఆమెది గెస్ట్ రోల్స్ కావడం విశేషం.
undefined
ఇప్పుడు తెలుగులోనూ సీరియల్స్ లో టాప్‌ పొజిషియన్‌లో ఉంది ప్రేమి విశ్వనాథ్‌. ఓ రకంగా స్టార్‌ రేంజ్‌ అనే చెప్పాలి.
undefined
ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో ఓ యాడ్‌ కూడా చేస్తుంది వంటలక్క. `తెనాలి డబుల్‌ హార్స్` మినపగుళ్లు యాడ్‌ చేస్తుంది. ఇందులో విశేషం ఏంటంటే ఆమె స్టార్‌ యాంకర్‌ సుమతో కలిసి ఈ యాడ్‌ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ యాడ్‌ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తుంది.
undefined
మరోవైపు ప్రేమి విశ్వనాథ్‌ సీరియల్స్ లో సాంప్రదాయంగా, అమాయకురాలిగా కనిపించినా, రియల్‌ లైఫ్‌లో మాత్రం తన చాలా తెలివైన అమ్మాయి. అంతేకాదు ట్రెండ్‌గానూ కనిపించి మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
ఆమె స్టయిలీష్‌ ఫోటోలు ఇన్‌స్టాలో పంచుకోగా వాటికి విశేషమైన వ్యూస్‌ వస్తుంటాయి. అదే సమయంలో శారీ అందాలతోనూ పిచ్చెక్కిస్తుందీ అమ్మడు. మరోవైపు ఆమె ఆస్తులు వివరాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.
undefined
వంటలక్క ఆస్తులు ఏకంగా 36కోట్లు అని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే దాదాపు నలభై కోట్లు ఉంటాయని అంటున్నారు.
undefined
ఇటీవల లగ్జరీ కారు వద్ద టీషర్ట్, చిరిగి జీన్స్ ప్యాంట్‌తో అదిరిపోయే లుక్‌లో కనిపించింది ప్రేమి. దీనికి ఆమె ఫ్యాన్స్ షాక్‌ కి గురవుతున్నారు.
undefined
ఆమెలో ఈ యాంగిల్‌ ఎప్పుడూ చూడకపోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. తన లైఫ్‌ స్టయిలీ ఈ రేంజ్‌లో ఉంటుందా అని నోరెళ్ల బెడుతున్నారు.
undefined
click me!