కార్తీక దీపం 2లో నేటి ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 10న ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీప తీసుకున్న నిర్ణయానికి కార్తీక్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. డాక్టర్ కూడా దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు.
కార్తీక దీపం 2లో 590 వ ఎపిసోడ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. అదే సమయంలో భావోద్వేగాలు తారాస్థాయికి చేరాయి. దీప ఇంటికి వచ్చిందా అని కార్తీక్ తన తల్లికి ఫోన్ చేసి అడగడంతో ఈ ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. కానీ దీప ఇంటికి రాలేదు అని చెప్పడంతో కార్తీక్ కంగారు పెరుగుతుంది. ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి దీప హాస్పిటల్ కి వచ్చింది అని చెబుతారు.
25
దీప కోసం హాస్పిటల్ కి వెళ్లిన కార్తీక్
కార్తీక్ టెన్షన్ పడుతూ హాస్పిటల్ కి వెళతాడు. అక్కడ దీపని చూసి షాక్ అవుతాడు. నీ కోసం కంగారుగా వెతుకుతున్నాను. ఇంత అర్జెంట్ గా హాస్పిటల్ కి రావలసిన అవసరం ఏంటి ? అత్తయ్యకి టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని డాక్టర్ చెప్పారు కదా అంటూ కార్తీ దీపని ప్రశ్నిస్తాడు. టాబ్లెట్స్ వాడితే సరిపోదు అంటూ దీప ఏడుస్తూ ట్విస్ట్ ఇస్తుంది. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆపరేషన్ చేయించకపోతే మా అమ్మ బతకదు అంటూ దీప కన్నీరు మున్నీరు అవుతుంది.
35
అమ్మ కోసం బిడ్డ ప్రాణాలు వదుకుకోవడానికి దీప రెడీ
దీప మనం ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు. ఇంతలో డాక్టర్ కలగజేసుకుని దీప ఆల్రెడీ ఆలోచించుకుంది అని చెబుతుంది. ఆమె ఒక నిర్ణయం తీసేసుకుంది. అది చెప్పడానికే నీకు తెలియకుండా ఇక్కడికి వచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బిడ్డ ప్రాణాలు వదులుకోవడానికి రెడీ అయింది. ఈ మాట వినగానే కార్తీక్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి.
నన్ను క్షమించు బావా అంటూ దీప తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. కార్తీక్ కూడా ఏడవడం ప్రారంభిస్తాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కోసం తాను ఎంతో కుమిలిపోయినట్లు దీప చెబుతుంది. నా కూతురు తన చెల్లి కోసం ఎదురుచూస్తోంది. తనతో ఆడుకోవాలని అనుకుంటోంది. ఇప్పుడు తనకి నేను ఏం చెప్పాలి. దీనికి నేను ఒప్పుకుంటే ఆ నిర్ణయం విలువ నా కూతురి ప్రాణం అంటూ కార్తీ ఆవేదన చెందుతాడు. చివరికి దీప నిర్ణయానికి కార్తీక్ అంగీకారం తెలుపుతాడు. కానీ డాక్టర్ ఆశ్చర్యపోతుంది. మీ అత్తగారి ప్రాణం కోసం బిడ్డని వదులుకుంటారా అని షాక్ అవుతుంది.
55
మరో ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్
నేను వెంటనే దీని గురించి మీ ఫ్యామిలీకి చెప్పేస్తాను. నిజం చెప్పడం నా బాధ్యత అని డాక్టర్ ఇంటికి బయలుదేరుతారు. కార్తీక్, దీప కూడా వెళతారు. డాక్టర్ ఇంటికి రావడం చూసి జ్యోత్స్న, ఆమె గ్రాండ్ మదర్ కి డౌట్ వస్తుంది. తాను అసలైన కూతుర్ని కాదనే నిజం డాక్టర్ కి తెలిసిపోయిందా ? దానికి ఇప్పుడు ఆమె ఫ్యామికి చెప్పేస్తుందా అని కంగారు పడుతుంది. కానీ డాక్టర్ మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. సుమిత్ర గారి శాంపిల్స్, జ్యోత్స్న శాంపిల్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ చెబుతుంది. దీనితో ఆపరేషన్ సవ్యంగా జరుగుతుంది అని ఫ్యామిలీ మెంబర్స్ సంతోషిస్తారు.