Karthika Deepam 2 Today Episode (మే 20వ తేదీ)లో కాంచన, దీప హ్యాపీగా పుట్టింట్లో ఉండిపోతారు. జ్యోపై ఫైర్ అవుతుంది పారు. కార్తీక్ కి పారుపై డౌట్ వస్తుంది. సూరజ్ పై జ్యో రివేంజ్ తీర్చుకుంటుంది. ఫీల్ అవుతాడు కార్తీక్. ఈ రోజు ఇంకా ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో నా కొడుకు క్యాంప్ కి వెళ్లాడు. మనుమరాలిని తీసుకొని మా అక్క ఊరెళ్లింది. కొడుకు, మనుమరాలు లేని ఇంట్లో కోడలితో నేనేం ఉంటాను. అందుకే నా కోడలిని తీసుకొని ఇలా వచ్చాను. నా కొడుకు వచ్చేవరకూ పుట్టింట్లోనే ఉంటాను అని సంతోషంగా చెప్తుంది కాంచన. శివన్నారాయణ, దశరథ, సుమిత్ర మీరు సంతోషంగా ఇంట్లో ఉండొచ్చు అని చెప్తారు.
26
జ్యో, పారు ప్లాన్
కోపంగా పక్కకు వెళ్తుంది జ్యోత్స్న. వెనకాలే వెళ్తుంది పారు. ప్లాన్ ఇలా రివర్స్ అయిందేంటి గ్రానీ అంటుంది జ్యోత్స్న. నువ్వు ఒక దరిద్రపు గొట్టుదానివే అంటుంది పారు. ఇంటికి వెళ్లి మరీ మీ అత్తను రెచ్చగొట్టావు.. దాని ఫలితమే ఇది అంటుంది పారు. దీపను నువ్వు ఆఫీసులో ఆడుకో.. నేను ఇంట్లో ఆడుకుంటాను. దాన్ని ఇక్కడినుంచి పారిపోయేలా చేద్దామనుకుంటారు పారు, జ్యో.
36
అత్త, అమ్మ దగ్గర దీప ఆశీర్వాదం
ఆఫీస్ కు వెళ్లేందుకు దీప, జ్యోత్స్న రెడీ అవుతారు. పోటీ పెట్టాక మొదటిసారి ఆఫీసుకు వస్తున్నారు. దేవుడికి దండం పెట్టుకోమని చెప్తాడు దశరథ. దీప కాంచన కాళ్లకు దండం పెట్టి ఆశీర్వదించమని అడుగుతుంది. ఆ తర్వాత సుమిత్ర కాళ్లకు దండం పెడుతుంది. దీప తెలివైంది మమ్మీ. నీ కూతురిని ఓడించాలని నీ దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటోంది అంటుంది జ్యో. ఈ ఆశీర్వాదం లుపు కోసం కాదు. మనోధైర్యం కోసం అని చెప్తుంది దీప. శివన్నారాయణ, దశరథ, దీపలను ఒక కారులో వెళ్లమని చెప్పి, కార్తీక్ తో కలిసి వేరే కారులో ఆఫీసుకు బయల్దేరుతుంది జ్యోత్స్న.
ఆఫీసుకు వెళ్తూ సూరజ్ ని చూసి సడెన్ గా కారు బ్రేకు వేస్తుంది జ్యోత్స్న. సూరజ్ మీద రివేంజ్ తీర్చుకోవాలని కారు దిగి ఒక కాల్ చేస్తుంది. వెంటనే కొందరు ఆఫీసర్లు వచ్చి ఎవరిని అడిగి ఫుట్ పాత్ పై స్టాల్ పెట్టావని సూరజ్ ను ప్రశ్నిస్తారు. ఇక్కడ స్టాల్ పెట్టడం వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉందని కంప్లైంట్ వచ్చింది.. స్టాల్ వెంటనే తీసేయాలి అని చెప్తారు. సూరజ్ రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకుండా ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కింద పడేస్తారు.
56
సూరజ్ సీరియస్
అది చూసిన కార్తీక్ స్టాల్ దగ్గరకు వచ్చి, ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తాడు. వీడికి ఈ మాత్రం జరగాలి అనుకుంటూ వస్తుంది జ్యోత్స్న. ఓ ఇదంతా నీ పనా? మర్యాదగా ఆపుతావా లేదా? అని జ్యోపై సీరియస్ అవుతాడు సూరజ్. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి కార్తీక్ కి చెప్తాడు. సూరజ్ చాలా మంచోడు. మా నాన్నను కాపాడింది తనే అని కార్తీక్ చెప్పినా.. జ్యోత్స్న వినదు.
66
సూరజ్ కోపం
నీలాంటి వాళ్లకు నేనేం భయపడను అంటాడు సూరజ్. ఇకపై నువ్వు ఎక్కడా స్టాల్ పెట్టలేవు అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏం చేయాలో అది చేశావ్. నేను ఏం చేయాలో నాకు తెలుసు అంటాడు సూరజ్. ఆ తర్వాత సూరజ్ చేతిలో రూ.100 నోటు పెట్టి, ఇప్పుడు ఇది నీకు చాలా అవసరం అని చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న. సూరజ్ కి సారీ చెప్తాడు కార్తీక్. మీరు వెళ్లండి బ్రో. నేను చూసుకుంటాను అంటాడు సూరజ్. ఆ తర్వాత చేతిలో నోటు వైపు కోపంగా చూస్తాడు సూరజ్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.