Karthika Deepam 2 Today Episode (మే 19వ తేదీ)లో కార్తీక్ ని తీసుకెళ్లిన జ్యోత్స్న. దీపపై ఫైర్ అయిన కాంచన. తండ్రి, అన్నలను ఫోన్ లో నానా మాటలు అన్న కాంచన. జ్యోత్స్నకి దిమ్మతిరిగే ప్లాన్ వేసిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న చేతిలో కంపెనీ పెడితే ఉద్యోగులు అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే షరతులకు ఒప్పుకోవాల్సి వచ్చిందని తల్లితో చెప్తాడు కార్తీక్. బావ అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. గతంలో జరగింది మర్చిపోయావా? నంబర్ వన్ గా ఉన్న కంపెనీని నాశనం చేశావ్. ఇప్పుడు మళ్లీ సీఈఓగా రావాలి అనుకుంటున్నావు. నువ్వు సీఈఓ అనగానే ఎంప్లాయిస్ కి జ్వరం పట్టుకుంది అంటాడు కార్తీక్. మాటలతో డామినేట్ చేయడం తప్ప.. నువ్వు ఏం చేయలేవ్ బావ అంటుంది జ్యోత్స్న.
దీపకు దూరంగా ఈ రెండు వారాలు ఎలా ఉంటావని అడుగుతుంది కాంచన. మా పెళ్లి అయ్యాక ఆషాఢం రాలేదు కదా.. ఈ రెండు వారాలు ఆషాఢం అనుకుంటాను అని చెప్పి బ్యాగ్ తీసుకొని జ్యోత్స్నతో కలిసి శివన్నారాయణ ఇంటికి బయల్దేరుతాడు కార్తీక్.
26
సుమిత్ర కోపం
శివన్నారాయణ ఇంటికి చేరుకున్న కార్తీక్, జ్యోత్స్నలకు పారు ఎదురుగా వచ్చి.. జ్యోత్స్నపై కోపం చూపించినట్లు నటిస్తుంది. ఇంట్లోకి వెళ్లిన జ్యోత్స్న, సుమిత్రకు హాయ్ చెప్పి జరిగిందంతా తెలిసే ఉంటుంది కదా.. జరిగిన దాంట్లో నా తప్పు ఏమైనా ఉందనిపిస్తే దీపను పోటీలో నుంచి తప్పుకోమనండి అని చెప్తుంది. భార్యా భర్తలను విడదీయడం తప్పు కదా అని కోప్పడుతుంది సుమిత్ర. దీపే ఒప్పుకున్నాక వేరే వాళ్లకు సమస్య ఏంటి అని అడుగుతుంది జ్యోత్స్న. మీరు ఏం చేసినా పెద్దవాళ్లు బాధపడకుండా చేయండని చెప్పి వెళ్లిపోతుంది సుమిత్ర.
36
దశరథ ఎమోషనల్
కార్తీక్, నీతో మాట్లాడాలి అని.. కార్తీక్ వెనకాలే వెళ్తారు దశరథ, శివన్నారాయణ. నేను నా భార్యకు సంజాయిషీ ఇవ్వకపోయినా నా చెల్లికి, నీ భార్యకు ఇవ్వాలి. లేదంటే నా ముఖం వాళ్లకు చూపించుకోలేను అని ఎమోషనల్ అవుతాడు దశరథ. మరోవైపు మొగుడ్ని పంపిచేశావ్ కదా.. నువ్వు ఒక్కదానివే ఉండు. పదవి కోసం భర్తను ప్రియురాలికి తాకట్టు పెట్టిన భార్యను నిన్నే చూస్తున్నానని దీపపై ఫైర్ అవుతుంది కాంచన.
అప్పుడే దీపకు దశరథ ఫోన్ చేసి క్షమాపణ చెప్తాడు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నాడా? ఏ అన్నయ్యా.. నీ కూతురు మా జీవితాలతో ఎంతలా ఆడుకున్నా మీకు పట్టింపు లేదా? నీ కూతురు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే కళ్లు మూసుకుపోయాయా? కడుపుతో ఉన్న నా కోడలి ఉసురు నీ కూతురికి తగలదా అని తండ్రిని, అన్నను నానా మాటలు అంటుంది కాంచన.
మీరే దీప గురించి చెప్పి నన్ను కన్విన్స్ చేశారు. ఇప్పుడు నింద నేను మోస్తున్నాను. కన్నీళ్లు నా కూతురు మోస్తోంది. మీరు ఏం చేస్తారో తెలియదు. రేపు ఉదయంకల్లా నా కూతురిని నవ్వుతూ చూడాలి. లేదంటే నేను ఎవరితో మాట్లాడను అని కార్తీక్, దశరథలతో చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఎవరూ బాధపడకుండా ఉండాలంటే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. అది నువ్వే అమలు చేయాలని దశరథతో చెప్తాడు కార్తీక్.
56
జ్యో, పారు షాక్
మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కు వెళ్లడానికి రెడీ అయి వస్తుంది జ్యోత్స్న. మనుమరాలిని చూసి మురిసిపోతుంది పారు. దీప కూడా ఆఫీసుకు వస్తుంది కదా అంటుంది పారు. మొగుడు పక్కన లేడని ఏ మూలన ఏడుస్తూ కూర్చొని ఉంటుంది, దీప ఆఫీసుకు రాదు అంటుంది జ్యోత్స్న. అప్పుడే కాంచన, దీప నవ్వుతూ ఎంట్రీ ఇస్తారు. వాళ్లద్దరినీ చూసిన పారు, జ్యో షాక్ అవుతారు.
66
కార్తీక్ అదిరిపోయే ప్లాన్
రెండు వారాలు దూరంగా ఉండాలని కండీషన్ పెట్టాం కదా.. దీప ఎందుకు వచ్చింది, అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని కాంచనను అడుగుతుంది జ్యోత్స్న. నా కూతురినే ఎందుకు వచ్చావ్ అని అడుగుతావా అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. ఆగు నాన్న నేను సమాధానం చెప్తాను అని మొదలుపెడుతుంది కాంచన.
ఇది నా పుట్టిల్లు. దీప నా కోడలు. నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్లాడు. మేము ఇద్దరమే ఇంట్లో ఉండటం ఎందుకు అని ఇలా వచ్చేశాము. నా కొడుకు క్యాంపు నుంచి వచ్చేవరకు ఇక్కడే ఉంటామని జ్యోకు షాక్ ఇస్తుంది కాంచన. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.