NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌

Published : May 18, 2026, 10:55 PM IST

జూ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెడితే ఆయన వెంటే తాము ఉంటామని చెప్పారు దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి. తారక్‌ సీఎం అవ్వడం పక్కా అని జోస్యం చెప్పారు.

PREV
14
ఎన్టీఆర్‌పై దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి కామెంట్‌

దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి.. వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్నారు. జగన్‌కి వీరాభిమానులుగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎంఎల్‌సీగా కూడా వ్యవహరిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్‌. అలాంటిది ఆయన తాజాగా షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఎన్టీఆర్‌ పార్టీ పెడితే అందులోకి వెళ్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ సిఎం అవ్వడం ఖాయమంటూ వెల్లడించారు. దువ్వాడ ఎన్టీఆర్‌కి వీరాభిమాని అని మాధురి వెల్లడించడం విశేషం.

24
దువ్వాడకి ఇష్టమైన హీరో ఎన్టీఆర్‌

దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి కలిసి `ఫస్ట్ టైమ్‌` అనే సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి ఎన్టీఆర్‌ బర్త్ డే ఉంది, విషెస్‌ చెబుతారా? అని ప్రశ్నించగా.. దివ్వెల మాధురి రియాక్ట్ అయ్యింది. శ్రీనివాస్‌కి ఎన్టీఆర్‌ అంటే ఇష్టమని తెలిపింది. ఆయన తన ఫేవరేట్‌ హీరో అని వెల్లడించింది. అప్పట్లో సీనియర్‌ ఎన్టీఆర్‌ అంటే ఇష్టమని, ఇప్పుడు ఆయనలా ఉన్న తారక్‌ అంటే ఇష్టమని, ఆయన సినిమాలను చూస్తాడని చెప్పింది. తమిళనాడులో విజయ్‌ మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని, భవిష్యత్‌లో ఆయన పాలిటిక్స్ లోకి వస్తాడని చెప్పింది..

34
ఎన్టీఆర్‌ సీఎం అవుతాడు

ఎన్టీఆర్‌ పార్టీ పెడతాడని, ఆయన సీఎం అవుతాడని, ఆయన పార్టీ పెడితే తాము ఆయన పార్టీలో చేరతామని, శ్రీనివాస్‌ కూడా వస్తాడని చెప్పింది. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలని, ఆయనకు సీఎం అయ్యే సత్తా ఉందని తెలిపారు. ఎన్టీఆర్‌ లాంటి నాయకులు మనకు అవసరమ ని, యూత్‌ రాజకీయాల్లోకి రావాలని, ఎప్పుడూ ఆ పాత మొహాలేనా, యూత్‌ వస్తే కొత్తకొత్త వండర్స్ చేయోచ్చు అని ఆమె తెలిపింది. ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా తాము విషెస్‌ చెబుతామని, అంతేకాదు పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనే ప్రయత్నం చేస్తామ ని వెల్లడించింది దివ్వెల మాధురి.

44
ఎన్టీఆర్‌ పార్టీ పెడితే అందులో చేరతాం

దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ రాజకీయాల్లో రాణించే సత్తా, ఛరిష్మా ఉందని తెలిపారు. తమిళనాడులో విజయ్‌ చాపకింద నీరులా వచ్చారని, కొన్నేళ్లుగా ఆయన గ్రౌండ్‌ వర్క్ చేశారని, సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. తన అభిమానులను పాలిటిక్స్ లోకి టర్న్ అయ్యేలా చేశారని చెప్పారు. అలాగే మన వద్ద ఎన్టీఆర్‌.. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు బాగా కష్టపడ్డాడు. ఎన్టీఆర్‌ తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు. ఒకవేళ వస్తే రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి.  ఎన్టీఆర్‌ నోటితో రాజకీయ ఎంట్రీ ఉంటే ఒక విప్లవమే వస్తుందని తెలిపారు. మొత్తంగా ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వస్తే తాను ఆయన వెంటే ఉంటామనే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్‌ వెల్లడించడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories