Karthika Deepam: మోనితను ప్రశ్నించిన కార్తీక్! ప్రాణాలు తీస్తాను అంటూ దీపకు మోనిత వార్నింగ్!

Published : Oct 11, 2022, 08:51 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 11వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..  

PREV
17
Karthika Deepam: మోనితను ప్రశ్నించిన కార్తీక్! ప్రాణాలు తీస్తాను అంటూ దీపకు మోనిత వార్నింగ్!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..మోనిత, ఈవిడ ఏంటి తిరిగి నన్ను ఇరికించేసింది. మంచిదైంది కార్తీక్ ఇక్కడ లేడు లేకపోతే నా పని అయి ఉండేది అనుకుని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కార్తీక్ ఉంటాడు.కార్తిక్ ఎప్పుడు ఇక్కడికి వచ్చాడు అని ఆశ్చర్యపోయి పక్కకు వెళ్లే లోగ అక్కడ శౌర్యను చూసి ఆశ్చర్య పోతుంది మోనిత.ఎందుకు నాకు ఒకరి తర్వాత ఇలా తయారయ్యారు అని అనుకోని, ఇప్పుడు గాని అది కార్తీక్ ని దీప ని ఎవర్ని చూసినా సరే రచ్చ రచ్చ అయిపోతుంది. వెంటనే సౌర్యను వీళ్ళిద్దరికీ కనబడకుండా చేయాలి అని అనుకోని శివతో చెవిలో ఏదో చెబుతుంది. అప్పుడు శివ పక్కనున్న దీప దగ్గరకు వెళ్లి వంటలక్క, కార్తీక్ సార్ నిన్ను పిలుస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు దీప అక్కడినుంచి వెళ్తుంది అదే సమయంలో మోనిత కార్తీక్ ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. కార్తీక్ పిలుస్తున్నాడు అని దీప అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ మోనిత ఉంటుంది. కార్తీక్ కోసం బాగా వెతుకుతున్నట్టు ఉన్నావ్ వంటలక్క, కార్తీక్ రాడు అని మోనిత అనగా, డాక్టర్ బాబు నన్ను పిలిచారు నాకోసం వస్తారు అని దీప అంటుంది. అప్పుడు మోనిత, పిలిచింది కార్తీక్ కాదు నేను అని అనగా, ఎందుకు పిలిచావే నన్ను? అక్కడ అందరూ బతుకమ్మ ఆడుతున్నారు కదా అని అంటుంది.
 

27

దానికి మోనిత ,అయినా రాజ్యలక్ష్మి నీకెలా తెలిసే అని అడుగుతుంది.దానికి దీప,అప్పుడే నీ ఆట మొదలైందా! నేను బతుకమ్మ ఆడిన తర్వాత దీని గురించి మాట్లాడదామనుకున్నాను కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను ఈరోజు ఇంటికి వెళ్లే లోపు డాక్టర్ బాబు దగ్గర నీ బండారం బయటపడతాను అని దీప అంటుంది. దానికి మోనిత, నువ్వేం చేయలేవే నీలాంటోళ్లు, ఆ రాజ్యలక్ష్మి లాంటోళ్లు ఒకలు కాదు వంద మంది వచ్చిన సరే కార్తీక్ నమ్మడు, కార్తీక్ నమ్మకుండా నేను చేస్తాను అని అంటుంది. వెనకాతల నుంచి కార్తీక్ ఈ మాటలన్నీ స్పష్టంగా వింటాడు.అప్పుడు మోనిత దీపతో, ఒకవేళ బలవంతంగా కార్తీక్ ని నా దగ్గర నుంచి నువ్వు లాక్కోవాలని చూస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అని అంటుంది. దానికి దీప, అని ప్రయత్నాలు అయిపోయి చివరికి ఇది మిగిలిపోయిందా?నువ్వు ప్రాణాలు తీస్తాను అంటే భయపడే రోజులు కావు ఇవి దేనికి భయపడను ఏం చేయాలనుకున్నావో చేసుకో. కానీ, డాక్టర్ బాబుని మాత్రం నిజం తెలుసుకునేలా చేస్తాను అని అంటుంది దీప. అప్పుడు మోనిత, నేను నిజం చెప్తున్నాను ప్రాణం తీయడానికి కూడా వెనకాడను ఏం చేసుకుంటావో చేసుకో. కార్తీక్ ని నన్ను విడదీసే ఎవ్వరిని వదిలిపెట్టను అని అంటుంది.

37

అప్పుడు దీప వెళ్లిపోయిన తర్వాత మోనిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తుంది. అప్పుడు కార్తీక్ మోనితను ఆపుతాడు. కార్తీక్ ని అక్కడ చూసిన మోనిత షాక్ అవుతుంది. అప్పుడు కార్తీక్ మోనితతో ,ఏంటి ప్రాణాలు తీస్తున్నావ్ అంటున్నావు అదేదో అలవాటు ఉన్న పనిగా.ఎన్ని మంది ప్రాణాలు తీసావు అని అడగగా, నేను ప్రాణాలు తీయడమేంటి కార్తీక్ ఆ దీప మన ఇద్దరి మధ్యలో వస్తాను అంటే నేను ఎందుకు ఊరుకోవాలి, నేను చాలాసార్లు చెప్పాను ఎప్పటికి నా మాట వినకపోతే నేనేం చేయాలి అని అంటుంది.దానికి కార్తీక్, ఇది మన ఊరు కాదా? వీళ్ళందరూ మన వాళ్లు కదా, కొత్త గతాన్ని సృష్టించావంటే, నా గతమే అబద్ధమైతే, నువ్వు నా భార్య అనేది కూడా అబద్ధమే కదా అని అనగా, అది మోనిత,అంతే కార్తీక్ నువ్వు కూడా వంటలక్క వాల లో పడిపోతున్నావు. 100 మంది చెప్పింది వినుకుండా ఆ ఒక్క ఆవిడ చెప్పింది వింటున్నావు అంటే నీకు నామీద నమ్మకం లేదా. ఇదే మన ఊరు కార్తీక్, వాళ్ళందరూ మనవాళ్లే.ఆవిడ అబద్ధం చెబుతున్నారు, నేను నిజమే చెప్తున్నాను. ఆ వంటలక్క ఇంకోసారి మనిద్దరి మధ్యలోకి వస్తే నేను ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను.

47

నాకు నువ్వంటే ఇష్టం నీకు నిజంగా వంటలక్క మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, వెళ్లి దానికి చెప్పు ఇంకోసారి నీ వెంట పడితే,మోనితకి సహనం తక్కువ, ప్రాణాలు పోతాయి అని కార్తీక్ కి కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మోనిత. ఆ తర్వాత సీన్లో సౌర్య, వాళ్ళ పిన్ని బాబాయ్తో దీప గురించి వెతుకుతుంది. అప్పుడు శౌర్య,బాబాయ్ మీకు ఆవిడ కనిపించిందా అని అడగా లేదమ్మా అని ఇంద్రుడు అంటాడు. పిన్ని మీకు కనిపించిందా అయినా మీకు తన మొఖం తెలియదు కదా అని అనగా, కాదమ్మా నేను ఈరోజు హోటల్లో వాళ్ళని కలిసాను.తను ఎవరో తెలుసా, నీకు ఆరోజు మంచినీళ్లు బాటిల్ కొనిచ్చారు కదా బస్సులో ఆవిడే ఈవిడ ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తానంటే, అమ్మని ఇచ్చానని చెప్పు అని డబ్బులు తీసుకోలేదు అని అనగా అమ్మలాంటి మంచి మనసున్న వాళ్ళే అలా చేస్తారు పిన్ని. నాకెందుకు ఆవిడే మా అమ్మని గట్టిగా అనిపిస్తుంది. మళ్ళీ వెతుకుతాము ఈసారి విడివిడిగా వెతికితే దొరికే అవకాశం ఉన్నది కదా అని మళ్ళీ వెతకడం మొదలు పెడతారు. ఆ తర్వాత మోనిత, దీప కోలాటం దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు కావేరి మోనితని ఏం జరిగింది అని అడగగా, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వచ్చాను.

57

కార్తికి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాను మనిద్దరి మధ్యకి అది వస్తే ప్రాణాలు తీస్తాను అని ఇంకా ఆ దీప ఏమి చేయలేదు అని చెప్తుంది. మరోవైపు దీప వాళ్ళ అమ్మ, ఏమైంది కార్తీక్ ఏం మాట్లాడాడు అని అడగగా, కార్తీక్ కాదమ్మా మోనిత ఉన్నది నన్ను అక్కడికి రప్పించడానికి డాక్టర్ బాబు పేరుని వాడుకుంది అని చెప్తుంది. దానికి వాళ్ళ అమ్మ, ఏం మాట్లాడింది అని అనగా ఏదో బెదిరించింది దాని మాటలన్నీ పట్టించుకోము కదా అని అంటుంది. ఆ తర్వాత అందరూ బతుకమ్మ చుట్టు కోలాటాలు ఆడుతారు. కోలాటాలు పూర్తయిన తర్వాత రాజ్యలక్ష్మి అందర్నీ బాగా చేశారు అని ప్రశ్నిస్తుంది.అక్కడి నుంచి అందరూ బతుకమ్మని తీసుకు వెళ్తూ ఉండగా కావేరీ మోనితతో, కార్తీక్ ఏడి అని అడగగా, జరిగిన విషయం గురించి ఆలోచించుకుంటూ ఎక్కడో ఉండుంటాడు అని అంటుంది. మరోవైపు కార్తీక్ జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొని, అసలు నేను ఎవరిని నమ్మాలి మోనిత ఏమో ప్రాణాలు తీస్తుందంటుంది. ఆ పెద్దావిడమో ఈ ఊరే నాది కాదు అంటుంది,దీప, మోనిత అన్ని మాటలు అంటున్న మౌనంగా ఉంది అంటే దీప వైపు తప్పు ఉన్నట్టా? ఆ రోజు నేను నాటకం దగ్గర ఎందుకు అలాగా రియాక్ట్ అయ్యాను! అంటే ఆ నాటకానికి నా జీవితానికి ఏదో సంబంధం ఉందా నిజం నా చుట్టూ ఉన్న నేను గమనించలేకపోతున్నానా అని అనుకుంటాడు.
 

67

ఆ తర్వాత సీన్లో శివ జాతరలో వస్తూ, మోనిత మేడం ఎందుకు కార్తీక్ సార్ పిలుస్తున్నారు అని దీపక్కని అక్కడకు తీసుకెళ్లార. మోనిత మేడం ఫ్రాడ్ లాగా ఉన్నారు దీపక్క మంచిది లాగా ఉన్నది. డబ్బులు తీసుకుంటున్నాను అని చెప్పి ఒక మంచి ప్రాణానికి నేను అన్యాయం చేయలేను కదా దీని గురించి ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో శౌర్య అక్కడికి వస్తుంది. సౌర్య అక్కడికి వచ్చి హాయ్ అంకుల్ అని శివని పలకరిస్తుంది. ఎవరమ్మా నువ్వు అని శివ అడగగా, ఆ రోజు మీరు నా దగ్గర వినాయకుడి బొమ్మలు కొన్నారు కదా సార్ చాలా థాంక్స్. మీ వల్లే ఆ రోజు మేము త్వరగా ఇంటికి వెళ్లిపోయాము అని అంటుంది. ఇంతలో శివ, శౌర్య మాట్లాడుకోవడం మూల నుంచి మోనిత చూసి, ఈ శివ గాడు దాంతో మాట్లాడుతున్నాడు  ఏంటి!ఇప్పుడు వాడు కార్తీక్ ప్రస్తావని చేస్తే ఇంక నా పని అయిపోయినట్టే అని అనుకుంటుంది. ఇంతలో శివ శౌర్యతో, ఆరోజు నీకు సహాయం చేసింది నేను కాదమ్మా మా సార్ అని అనగా, నేను  వచ్చి థాంక్స్ చెబుదామనుకున్నాను కానీ అప్పటికే మీరు వెళ్లిపోయారు అని అనగా, మా సర్ కూడా నీకు థాంక్స్ చెప్దాం అనుకున్నారమ్మా కానీ అని అనుకోని  గతంలో జరిగిన విషయం గుర్తొచ్చి, అయినా ఎందుకు ఆరోజు మేడం సార్ ని పాప దగ్గరికి వెళ్లకుండా ఆపారు?.

77

ఈ పాపను చూడగానే మేడం ఎందుకలా భయపడ్డారు? ఇప్పుడు ఈ పాపని సార్ దగ్గరికి తీసుకొని వెళ్తే వీళ్ళిద్దరి మధ్య సంబంధం తెలుస్తుంది కదా అని అనుకొని,పోనీలే అమ్మ ఇప్పుడు థాంక్స్ చెప్తావా ఆయన ఇక్కడే ఉన్నారు తీసుకెళ్తాను అని శివ అంటాడు. ఇంతలో మోనిత శివకి ఫోన్ చేసి, రేయ్ దాంతో నీకేం సంబంధం రా? మూసుకొని దాన్ని అక్కడే వదిలి నీ పనులు చూసుకో లేకపోతే ఉద్యోగం పీకేస్తాను అని భయపెడుతుంది. భయంతో ఉన్న శివ, అమ్మ మనం ఇప్పుడు వెళ్లడం కుదరదు మా మేడం నాకు పని చెప్పారు అని అనగా,నాకు చూపించే చాలు నేను మాట్లాడతా అని సౌర్యం అంటుంది. దానికి శివ, ఇప్పుడు వెళ్లకపోతే నా ఉద్యోగం పోతుందమ్మ దయచేసి అర్థం చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే అంకుల్ అని సౌర్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories