
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. కార్తీక్ అక్కడున్న డాక్టర్ని వారణాసికి ఎలాగుంది అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ తనకి కొంచెం సీరియస్ గా ఉన్నది కోమాలోకి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పారు. డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత కార్తీక్ గతాన్ని గుర్తు చేసుకుంటూ నేను దీపకు ఎంత అన్యాయం చేశాను పాపం నాకోసం ఎంత నిరీక్షిస్తూ ఉంటుందో. అయినా దీపకు నాకు ఒకేసారి యాక్సిడెంట్ అయింది మరి నేను ఈ మోనిక చేతికి ఎలా చిక్కానో ఒకవేళ దీప దగ్గరే ఉంటుంటే గతం మర్చిపోయిన కనీసం దీప భర్తగా ఉండేవాడ్ని కదా అయినా దీని అంతటికి మూలం మోనితాయే దాని పని చెప్తాను అని కోపంగా ఉంటాడు. మరోవైపు దీప తన ఇంట్లో, వాళ్ళ అమ్మ అన్నయ్యలతో కూర్చుని కార్తీక్ రాలేదని ఏడుస్తూ, ఆ మోనిత అన్నంతపని చేసింది డాక్టర్ బాబుని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. ఇంక డాక్టర్ బాబు నా దగ్గరికి రారు ఆ మాయలాడి ఎన్నైనా చేస్తుంది అని అనగా, దీప వాళ్ళ అమ్మ, నీది మూడుముళ్ల బంధం అమ్మ దాన్ని ఎవరు విడగొట్టలేరు అని అంటుంది.
దానికి దీప, మాడి మూడుముళ్ల బంధమైన సరే మోనిత అనే చిక్కుముడి ఉన్నది కదా అమ్మ దాన్ని విడదీయడం కుదరదు. ముందు నన్ను డాక్టర్ బాబు ముందు చులకన చేసి నన్ను ఒక చెడ్డదానిలా నిరూపించాలనుంది. కానీ ఎప్పుడైతే దుర్గ వచ్చాడో దానికి ఏం చేయాలో తెలియని స్థితిలో అయోమయంగా ఉన్నది ఎక్కడ డాక్టర్ బాబుకి దాని మీద అనుమానం పెరిగిపోయి నా దగ్గరికి వస్తారని భయంతో ముందే డాక్టర్ బాబుని నా దగ్గర నుంచి దూరం చేసినట్టు ఉన్నది అని భయపడదు ఏడుస్తూ ఉంటుంది దీప. ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి నువ్వు బాధపడొద్దు దీపమ్మ ఆ మోనిత కూడా కార్తీక్ సార్ కోసం ఏడుస్తుంది అని అనగా, నీకు తెలియదు దుర్గ ఎక్కడ మనం దాన్ని అనుమానిస్తామని ఏడుస్తుంది అని అంటుంది. దానికి దుర్గ, నాకెందుకుకో అది నిజమైన ఏడుపు లాగే అనిపిస్తుంది.
ఒకవేళ అబద్ధమైతే ఎన్ని రోజులు దాస్తాది ఎప్పటికి అయినా అప్పుడు తెలియాల్సిందే కదా. నాకు తెలిసి కార్తీక్ సార్ సంగారెడ్డి లోనే ఉంటారు అని అంటాడు దుర్గ. మరోవైపు మోనిత, కార్తీక్ తో తన పెళ్లి ఫోటోని చూస్తు ఎక్కడికి వెళ్ళిపోయావు కార్తీక్ నీకోసం ఎన్ని ఏళ్ళు నిరీక్షించాను ఈ పదేళ్లు పడిన కష్టమంతా నీకోసమే కదా దీని కోసమా నేను ఇన్నాళ్లు కష్టపడింది నన్ను వదిలేయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు.తిరిగి రా కార్తిక్ దయచేసి నన్ను వదిలేయవద్దు నా మనసులో నీకు స్థానం ఎప్పటికీ తరగదు కేవలం నీకు మాత్రమే నా మనసును స్థానం ఉంటుంది అని ఉంటుంది.
దానికి బోటిక్ లో ఉన్న మిగిలిన వాళ్ళు, ఇది దొంగ ఎడపా కావాలని నడుస్తుందా కూడా తెలియడం లేదు. అసలు నిజంగానే కార్తీక్ సర్ దీన్ని వదిలేలిపోయాడంటే ఆ దుర్గ మీద అనుమానంతో నేనేమో. నిజంగా దుర్గ కి దానికి ఏమైనా అయ్యుంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత సీన్లో దీప ఏడుస్తూ ఉండగా దుర్గా,ఇంక మనం సంగారెడ్డి వెళ్లి వెతుకుదాం దీపమ్మ నేను వెళ్లి వస్తాను అని అడగా నేను వస్తాను దుర్గ అని దీప అంటుంది. నువ్వెందుకు దీపమ్మ అని దుర్గా అడగగా డాక్టర్ బాబు ని చూడకపోతే నేను ఉండలేను చూసిన వెంటనే నా మనసు కుదురు పడుతుంది అని అంటుంది.
అలాగే గుమ్మం దాటి బయటికి వచ్చేసరికి కార్తీక్ అక్కడికి వస్తాడు. కార్తీక్ ని చూసిన దీప, ఎంతో ఆనందపడి వెళ్లి డాక్టర్ బాబు మీకు ఎలా ఉన్నది బానే ఉన్నారా? తలకి ఆ గాయం ఏంటి అని గాబరా పడిపోతూ ఉంటుంది కార్తీక్ ని కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇస్తుంది. దీప ప్రవర్తన చూసిన కార్తీక్ ఎంత మంచి దానివి దీపా నీకు ఎంత అన్యాయం చేశాను అని మనసులో అనుకొని ఇప్పుడు నాకు గతం గుర్తొచ్చింది, దీప గురించి తెలిసింది అని మోనితకు తెలిస్తే దీప కు మళ్లీ ప్రమాదం ఉంటుంది కనుక నేను ఈ రహస్యం మనసులోనే ఉంచుకొని ఆ మోనిత పని పట్టాలి అని అనుకుంటాడు.అప్పుడు కార్తీక్ ని చూసిన దీప ఏమైంది డాక్టర్ బాబు అలాగున్నారు? ఏవైనా దెబ్బలాటకు దిగారా? లేకపోతే ఎవరైనా కొట్టేరా? అని కంగారుగా అడగగా ఏమీ లేదు దీప అనుకోకుండా జరిగిందంటే ఇంక నేను ఇంటికి వెళ్తాను నన్ను ఇంటి వరకు దింపు అని కార్తీక్ అంటాడు.
మరోవైపు మోనిత చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకుంటూ శౌర్య అనవసరంగా రాయి పక్కకు తగిలింది సరిగ్గా తగిలి ఉంటే నాకు పగ తీరేది అయినా ఇంకోసారి కొడదాం అనుకునేసరికి మోనిత ఆంటీ నన్ను చూసేశారు. అసలు ఎందుకు అమ్మ, నాన్నలు చనిపోయారని అబద్ధం చెప్పింది అసలు అమ్మానాన్నలు నిజంగా బతికే ఉన్నారా? ఒకవేళ బతికే ఉంటే ఎక్కడున్నారు? ఇది మోనిత ఆంటీకి మాత్రమే తెలుస్తుంది ఒకవేళ మోనిత ఆంటీ దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా సరే రాయి విసిరేను అన్న కోపంతో ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది.మరోవైపు దీప కార్తీక్ ని ఇంటి వరకు దింపుతుంది. అదే సమయంలో మోనిత పోలీసులకు ఫోన్ చేసి, కార్తీక్ ఫోటో పంపాను కొంచెం తనని వెతికి పెట్టండి అని అనగా కార్తీక్ అక్కడికి వస్తాడు. ఫోన్ పెట్టేసిన మోనిత కార్తీక్ ని చూసి, కార్తీక్ ఆ దెబ్బ ఏంటి ఎలాగా జరిగింది ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసం ఎదురు చూస్తున్నాను.
అయినా నీకేం గుర్తుంటాది నిన్నేం జరిగిందో అని చెప్పి పక్కనే ఉన్న దీపతో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే నువ్వేనా దీనికి కారణం అని దీప ని తిడుతూ ఉండగా కార్తీక్ ఆపి, అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ మోనిత నన్ను ప్రశ్న అడిగావు, ఓ జవాబు ఇవ్వకముందే వంటలక్క జోలికి ఎందుకు వెళ్తావు అసలు నీకు నేను తిరిగి వచ్చానని సంతోషం కన్నా వంటలక్క పక్కనున్నాదని బాధ ఎక్కువ అయిపోతుంది అని అనగా, అలా అంటావ్ ఎందుకు కార్తీక్ నాకు నువ్వే అన్నిటి కన్నా ముఖ్యం కదా అని అనగా సరే డాక్టర్ బాబు నేను వెళ్తాను అని దీప అంటుంది. దానికి కార్తీక్ జాగ్రత్త అని అంటాడు.
బయటికి వచ్చిన దీప కార్తీక్ ని చూసి నవ్వుతూ వెళ్తుంది. అప్పుడు మోనిత కార్తీక్ తో,దానిమీద కన్సన్ చూపిస్తున్నావ్ ఏంటి కార్తీక్ అని అనగా, నేను చెప్పాను కదా నీకు నాకన్నా మిగిలా వాళ్ళందరూ ఎక్కువే నా గురించి తప్ప అందరూ గురించి ఆలోచిస్తావు అని అంటాడు. అదే సమయంలో దుర్గ అక్కడికి వచ్చి మోనిత, నీ హ్యాండ్ బ్యాగ్ నిన్న రాత్రి నా దగ్గర వదిలేసావు అని అనగా కార్తీక్, రాత్రిపూట తన హ్యాండ్ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని దుర్గని అడుగుతాడు. దానికి దుర్గ, నిన్న రాత్రి మేమిద్దరం కలిసి సంగారెడ్డి నుంచి వచ్చాము అని అనగా మోనిత, అబద్ధం చెపుతున్నాడు కార్తీక్ వీడు అని అంటుంది. దానికి దుర్గా, అబద్ధం చెప్పినట్టు అయితే నీ హ్యాండ్ బాగ్ నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!