Karthika Deepam: గుండెనొప్పితో చావుబతుకుల మధ్య పోరాడుతున్న సౌర్య.. డబ్బులేక అల్లాడిపోతున్న కార్తీక్, దీప!

First Published Jan 28, 2022, 9:20 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

కార్తీక్ (Karthik).. ఆశ్రమంలో సౌందర్య వాళ్లను చూసిన విషయం దీపకు చెబుతాడు. ఇక దీప (Deepa) కూడా తాను కూడా అత్తమామయ్య వాళ్లను చూశాను అని.. కానీ వెళ్లే పరిస్థితి కాదని.. మాట్లాడే పరిస్థితి లేదని మీకు చెప్పలేదు అని కార్తీక్ తో అంటుంది.
 

కార్తీక్ (Karthik) ఇన్ని రోజులు మమ్మీ డాడీల విషయం చెప్పనందుకు బాధపడ్డాను అని కానీ నువ్వు కూడా చెప్పలేదు అంటే అందులో న్యాయం ఉందని అనిపిస్తుందని అంటాడు కార్తీక్. అలా కాసేపు వారిద్దరూ సౌందర్య (Soundarya) వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
 

ఇక మరుసటి రోజు ఉదయాన్నే సౌర్య (Sourya), హిమ (Hima) స్కూల్లో సార్ చెప్పినట్లు జాగింగ్, స్కిప్పింగ్ చేస్తే బాగుంటుందని అన్నారు కదా.. ఇప్పుడు  స్కిప్పింగ్ ఆడదామా అని అనుకుంటారు. దానికోసం తాడు ని వెతుకుతారు. కానీ అక్కడ ఎక్కడ తాడు కనిపించదు.
 

అప్పుడే దీప (Deepa) రావటంతో తనని తాడు అడుగుతారు. ఇక దీప ఇంట్లో పని ఉంది అని చెప్పి వెళ్లిపోతుంది. అలాగే వెతుకుతూ ఉండగా కార్తీక్ (Karthik) వచ్చి అడగటంతో వారికి ఒక తాడును అందిస్తాడు. ఇక పిల్లలిద్దరూ తాడుతో ఆడుకుంటూ ఉంటారు.
 

మరోవైపు రుద్రాణి (Rudrani) కార్తీక్ వాళ్లను బాధపెట్టాలని అనుకుంటుంది. ఆ విషయాన్ని తన మనుషులకు చెబుతుంది. వాళ్ళు అప్పు కట్టకూడదని.. వాళ్ళను ఇలాగే బాధ పెట్టాలి అని అంటుంది. దాంతో కార్తీక్ ను (Karthik) తీసుకొని రమ్మని తన మనుషులకు చెబుతోంది.
 

ఇక సౌర్య (Sourya) ఆడుతూ ఆడుతూ ఆయసం వచ్చి కింద పడిపోతుంది. వెంటనే హిమ అరవడంతో కార్తీక్, దీప పరిగెత్తుకు వస్తారు. కార్తీక్ (Karthik) సౌర్య పరిస్థితి చూసి గతంలో గుండె ఆపరేషన్ చేశాను కదా మళ్లీ ఏదైనా సమస్య వచ్చిందా అని అనుకుంటాడు.
 

ఇక దీప (Deepa), హిమ ఏడుస్తూ ఉండగా వారిని ఏడవకూడదని బ్రతిమాలుతాడు. ఇక డబ్బులు లేకపోయేసరికి సౌందర్య వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగాలనుకుంటాడు. దాంతో ఆశ్రమంలో ఉన్న వ్యక్తి సౌందర్య (Soundarya) గురించి తనకు ఏమీ చెప్పలేనని తిరిగి వెనక్కి పంపిస్తాడు. మరోవైపు సౌర్య గుండెనొప్పితో బాగా బాధ పడుతుంది.

click me!