మూవీలోని విజయ్ ప్రకాష్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరోవైపు దర్శకుడు చిత్రంలో పార్లల్ గా కార్తీ, సర్దార్, నీటి కంపెనీ వివాదాలను చూపించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా రచయిత నీటిని కథావస్తువుగా మలిచిన తీరు ప్రస్తుత వాస్తవిక పరిస్థితులకు సరిపోల్చినట్టు ఉంటుంది. కలుషితమనే పేరుతో నీటి వ్యాపారం ఎలా సాగుతుందనే అంశాన్ని టచ్ చేయడం కథకు బలాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. కథతో పాటు ఫన్నీ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్, యాక్షన్ సీన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. ద్వితియార్థంలో ‘సర్దార్’ ఫ్లాష్ బ్యాక్ మినహా సినిమా పర్లేదని చెప్పొచ్చు. జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.