`కార్తీకదీపం` ఫేమ్‌ డాక్టర్‌ బాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్‌.. స్టార్‌ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు..

First Published Jul 20, 2021, 2:27 PM IST

`కార్తీకదీపం` ఫేమ్‌ డాక్టర్ బాబుగా పాపులర్‌ అయిన నిరుపర్‌ పరిటాల ఆస్తులు చూస్తుంటే స్టార్‌ హీరోలను తలపిస్తున్నారు. ఆయన సంపాదన వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఆ ఆస్తుల చిట్టాపై ఓ లుక్కేస్తే.. 

సీనియర్‌ సీరియల్‌, సినీ నటుడు, రైటర్‌ ఓంకార్‌ పరిటాల తనయుడైన నిరుపమ్‌ మొదట్లో హీరో కావాలనుకున్నారు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ప్రిపేర్‌ అవుతున్న సమయంలోనే తండ్రి కన్నుమూశారు. దీంతో సీరియల్‌లోకి అడుగుపెట్టారు నిరూపమ్‌.
undefined
సీరియల్‌తో నటుడిగా పరిచయమై `చంద్రముఖి` సీరియల్‌తో బాగా పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక సీరియల్స్ చేశారు. తండ్రికి ఉన్న మంచి పేరు, కష్టపడే తత్వం వంటివి నిరుపమ్‌ని టీవీ రంగంలో స్టార్ ని చేశాయి. ఓరకంగా బుల్లితెర స్టార్‌ హీరో నిరుపమ్‌ అని చెప్పొచ్చు.
undefined
ఇటీవల `కార్తీకదీపం` సీరియల్‌తో నేషనల్‌ వైరల్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. ఈ సీరియల్‌ దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. డాక్టర్‌ బాబు, వంటలక్క పాత్రల మధ్య సంఘర్షణ ఈ సీరియల్‌కి హైలైట్‌గా నిలిచింది. దీంతో వంటలక్కగా చేసిన ప్రేమి విశ్వనాథ్‌, డాక్టర్‌ బాబుగా చేసిన నిరుపమ్‌ మంచి గుర్తింపుని, పాపులారిటీ, స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
undefined
ఇదిలా ఉంటే ఇప్పుడు నిరుపమ్‌ ఆస్తుల వివరాల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్‌ హీరోల రేంజ్‌లో ఆయన సంపాదన ఉందనే న్యూస్‌ వైరల్‌ అవుతున్నాయి. ఆ వివరాలు చూస్తే..
undefined
ప్రస్తుతం నిరుపమ్ ఒక్కో సీరియల్‌కి రోజుకి 22వేలు పారితోషికంగా అందుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన మూడు సీరియల్స్ చేస్తున్నారు. ఈ మూడింటికి కలిపి దాదాపు అరవై వేలు రోజుకి వస్తున్నట్టు సమాచారం.
undefined
ఈ లెక్కన ఆయనకు నెలకు దాదాపు రూ.15లక్షలకుపైనే అందుకుంటున్నారని టాక్‌. అయితే నిరుపమ్‌ భార్య మంజుల కూడా నటి కావడంతో ఆయన సంపాదన మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. దీంతో నెలకి ఆయన సంపాదన ఇరవై నుంచి ఇరవై అయిదు లక్షల వరకు ఉంటుందని భోగట్టా. ఈ లెక్కన ఏడాదికి రెండు మూడు కోట్ల వరకు అర్జిస్తున్నారనే వార్త వైరల్‌ అవుతుంది.
undefined
ఆస్తుల విషయానికి వస్తే నిరుపమ్‌కి శ్రీనగర్‌ కాలనీలో రూ.80 నుంచి కోటీ విలువ చేసే సొంత ఫ్లాటు ఉంది. అలాగే ఇతర చోట్ల కూడా ఆస్తులున్నాయట.
undefined
వైజాగ్‌లో రూ. ఐదు కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉందని సమాచారం. వీటితోపాటు ఇరవై లక్షల విలువ చేసే రెండు కార్లు ఉన్నాయని తెలుస్తుంది.
undefined
అయితే నిరుపమ్‌ లగ్జరీలకు పోకుండా వచ్చిన సంపాదనని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారని సమాచారం. కష్టపడిన ప్రతిపైసాని జాగ్రత్తగా మెయింటేన్‌ చేస్తూ తనకంటూ సమాజంలో ఓ స్టేటస్‌ని ఏర్పర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట.
undefined
click me!