తన రెండో కుమారుడిని ఇంట్రడ్యూస్‌ చేసిన కరీనా కపూర్‌.. ఊరించి పెద్ద ట్విస్ట్ !

First Published Apr 16, 2021, 5:19 PM IST

బేబో కరీనా కపూర్‌ ఫిబ్రవరిలో రెండో కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది కరీనా. కానీ ఊరించి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. 

కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ జంటకి ఈ ఏడాది ఫిబ్రవరి 21న పండంటి రెండో కుమారుడికి జన్మనిచ్చింది కరీనా కపూర్‌. ఈ సందర్భంగా ప్రముఖులంతా వీరికి అభినందనలు తెలిపారు. సైఫ్‌ అలీ ఖాన్‌ సైతం తన ఆనందాన్ని పంచుకున్నారు. ఫ్యామిలీతో దిగిన ఫోటోలను పంచుకున్నారు.
undefined
రెండో కుమారుడు జన్మించి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. దీంతో కరీనా కపూర్‌ తాజాగా తన సెకండ్‌ సన్‌ని అభిమానులను పరిచయం చేస్తూ ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో అభిమానులు సైతం ఫుల్‌ ఖుషీ అయ్యారు.
undefined
తమ అభిమాన నటి కుమారుడు ఎలా ఉంటాడో చూడాలని ఆతృతగా ఆ ఫోటోని ఓపెన్‌ చేసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఎందుకంటే కరీనా తన కుమారుడి ఫేస్‌ కనిపించకుండా చిన్న పిల్లాడి ఎమోజీ పెట్టింది.
undefined
దీంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అవుతున్నారు. ఇదే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే తన ముద్దుల కుమారుడిని పూర్తి స్థాయిలో పరిచయం చేసేందుకు ఇంకా కాస్త టైమ్‌ ఉందని చెప్పకనే చెప్పింది కరీనా.
undefined
ఇక కరీనా పంచుకున్న ఫోటోలో సైఫ్‌ అలీ ఖాన్, పెద్ద కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్ కలిసి చిన్న కుమారుడితో సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సందర్భంగా కరీనా చెబుతూ, ఇది నా వారంతపు లుక్‌. ఎలా ఉంది చెప్పండి?` అంటూ పోస్ట్ పెట్టింది. చిన్నబాబు ఫేస్‌ కనిపించకపోయినా అభిమానులు మాత్రం ఈ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చక్కర్లు కొడుతుంది.
undefined
ఇదిలా ఉంటే 2012లో సైఫ్‌, కరీనా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయంతెలిసిందే. వీరికి 2016లో తైమూర్‌ అలీ ఖాన్ జన్మించారు. 2021 ఫిబ్రవరిలో మరో కుమారుడు జన్మించాడు. సెకండ్‌ సన్‌కి జన్మనిచ్చిందో లేదో వెంటనే కమర్షియల్‌ యాడ్స్ లో పాల్గొంటుంది కరీనా. ఎంతైనా వర్క పట్ల తన నిబద్ధతని చాటుకుంటోందని చెప్పొచ్చు.
undefined
ప్రస్తుతం కరీనా అమీర్‌ ఖాన్‌తో కలిసి `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తుంది. డెలివరీకి ముందే ఇందులోని తన పార్ట్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది.
undefined
click me!