కరాటే కళ్యాణి ఇంట్లో  బిగ్ బాస్ బ్యాచ్... ఫంక్షన్ లో అరియనా, అవినాష్, సోహైల్ సందడి!

First Published | Jan 29, 2021, 9:10 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్స్  బాగా ఫేమస్ అయ్యారు. అంతకు ముందు పేరు కూడా తెలియని అఖిల్, అరియనా, సోహైల్, దివి లాంటి వారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. దీనితో వీరందరూ అనేక వేడుకలు, వేదికలపై సందడి చేస్తున్నారు. 
 

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొందరు నటి కరాటే కళ్యాణి ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ కి హాజరై సందడి చేశారు. బిగ్ బాస్ షో ఫైనలిస్ట్స్  అయిన సోహైల్, అరియనాలతో పాటు అవినాష్, కుమార్ సాయి, దివి మరియు అమ్మ రాజశేఖర్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
కరాటే కళ్యాణి కొడుకు బర్త్ డే ఫంక్షన్ కి వీరందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి సందడి చేసిన ఫోటోలను కరాటే కళ్యాణి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకోవడం జరిగింది.

రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ సైతం ఈ వేడుకకు హాజరై, కరాటే కళ్యాణి కుమారుడికి బ్లెస్సింగ్స్ అందించారు.
కరాటే కళ్యాణి కూడా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రెండు వారాలకే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. యంగ్ జనరేషన్ తో హౌస్ లో ఆమె ఇమడలేకపోయారు.
ఇక కరాటే కళ్యాణి కొడుకు బర్త్ డే వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆడిపాడినట్లు తెలుస్తుంది. కరాటే కళ్యాణితో కలిసి సోహైల్, దివి, అరియనా, అవినాష్ సరదాగా గడిపిన ఫోటోలు ఆసక్తి రేపుతున్నాయి.
మరోవైపు సోహైల్ హీరోగా ఓ మూవీకి సైన్ చేయగా... అవినాష్ స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నారు.
చేస్తున్నారు.  అరియనా, దివిలకు కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం ఉంది. ఈసారి బిగ్ బాస్ షో కొందరికి చాలా మంచి చేసింది.

Latest Videos

click me!