తిండికోసం బిగ్ బాస్ హౌస్ లో యుద్దాలు, రేషన్ టాస్క్ లో నిఖిల్ కు మణికంఠ వెన్నుపోటు..

First Published | Sep 12, 2024, 12:06 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ లాక్ డౌన్ నడుస్తోంది. తిండి కోసం తిప్పలు తప్పడంలేదు. రేషన్ కావాలంటే టాస్క్ లు గెలవాల్సిందే అని బిగ్ బాస్ రూల్ పెట్టడంతో.. తిండికోసం గోడవలుస్టార్ట్ అయ్యాయి. 
 

లాస్ట్ వీక్ అంతా ఎందుకు గొడవపెట్టుకుంటున్నామో కూడా తెలియకుండా ఒకరిని మరొకరు తిట్టుకుంటూ గడిపేశారు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్.. ఇక ఇప్పుడు సెకండ్ వీక్ లో వారు గొడవపెట్టుకోవడం కోసం మంచి మంచి టాస్క్ లు వెతికి మరీ ఇస్తున్నాడు బిగ్ బాస్. 

అందులో భాగంగానే ఇంట్లో రేషన్ కట్ చేసి.. తిండి కావాలంటే టాస్క్ లు ఆడాల్సిందే అన్న రూల్ ను తీసుకువచ్చాడు. ఈక్రమంలోనే ముడు గ్రూపులలకు రెండు టాస్క్ లు పెట్టారు. మొదటి టాస్క్ లో యష్మి టీమ్ గెలిచి.. మేజర్ రేషన్ ను సాధించింది. ఇక రెండో టాస్క్ లో నైనిక టీమ్ గెలిచింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఈరెండు టాస్క్ లలో ఓడిపోయి నిఖిల్ టీమ్  ఏమాత్రం రేషన్ లభించలేదు. ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీమ్ లో మణికంట టాస్క్ లు ఆడటానికి తన బెస్ట్ ఇచ్చాడు. కాని అవి వర్కౌట్ అవ్వలేదు. ఇక నిఖిల్ కు , మణికంటకు తినడానికి రాగి జావ, ఉడకపెట్టిన కూరగాయలు మాత్రమే ఇచ్చాడు బిగ్ బాస్. 
 


ఇక రేషన్ విషయంలో కూడా గొడవలు తప్పలేదు. అందులోను రేషన్ ను ఒకటీమ్ నుంచి మరొకట టీమ్ దొంగిలిస్తుండటంతో.. అసలు మజా స్టార్ట్ అయ్యింది. యష్మి తో పాటు.. వారి టీమ్ ఈ విషయంలో ముందుగా ప్రొసీడ్ అయ్యారు. ఇక తమ రేషన్ దొంగిస్తున్నారుఅని తెలిసి నైనికా టీమ్ నుంచి అఫ్రీది  మండి పడ్డాడు. 

అంతే కాదు యష్మీ టీమ్ నుంచి రేషన్ ను తీసి.. నబిల్ దాచడం స్టార్ట్ చేశాడు. ఇక ఇదంతా జరుగుతుంటే.. సోనియా మాత్రం తన స్ట్రాటజీని తాను పాటిస్తుంది. హౌస్ లో సంగం మందికే ఫుడ్ డొరకడం ఏంటీ అని ఏమోషనల్ అయ్యింది. ఇకసోనియా పక్కా గేమ్ స్ట్రాటజీని వాడుతోంది. టాప్ కంటెస్టెంట్స్ చుట్టూ తిరుగుత..వారిని తన గేమ్ ట్రాప్ లోకి లాగడానికి ప్రయత్నిస్తోంది. 
 


ఇక విష్ణు ప్రియ మీద మరోసారి నోరు పారేసుకుంది సోనియా. ఆమె మాటలకు అభయ్ కూడా వంత పాడటంతో.. ఆమ ప్రభావం హౌస్ లో ఎంత కాదన్నా కనిపిస్తోంది. ఇక ట్విస్ట్ టాస్క్ లతో పాటు.. ఈ రోజు బిగ్ బాస్ లో వాదోపవాదాలు, ట్వీస్ట్ లు చాలానే ఉన్నాయి. 

ఇక నిఖిల్ కూడా డల్ అవుతున్నట్టు తెలుస్తోంది. టీమ్ ను టీడ్ చేసే అతను ఎందుకు డల్ గా ఉన్నాడో తెలియడంలేదు. ఇక నిఖిల్ తో రాసుకుపూసుకు తిరిగిన సోనియా.. అతనిమీదే రకరకాలుగా మాటలు స్పెడ్ చేస్తోంది. పృధ్వితో ఎక్కవుగా కలిసి ఉంటోంది. 
 

Latest Videos

click me!