షారూఖ్‌ ఖాన్‌తో కరణ్‌ జోహార్‌ అక్రమ సంబంధం.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టి స్టార్‌ మేకర్

Published : Jun 25, 2022, 12:22 PM IST

స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌, దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ మధ్య శారీరక సంబంధం ఉందా?.. బాలీవుడ్‌లోనే కాదు ఈ విషయాలు ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. సంచలనం రేపుతు్నాయి. 

PREV
16
షారూఖ్‌ ఖాన్‌తో కరణ్‌ జోహార్‌ అక్రమ సంబంధం.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టి స్టార్‌ మేకర్

దర్శక, నిర్మాత, హోస్ట్ కరణ్‌ జోహార్‌ బాలీవుడ్ లో స్టార్‌ మేకర్‌గా రాణిస్తున్నారు. భారీ చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. మరోవైపు `కాఫీ విత్‌ కరణ్‌` షోతోనూ అలరిస్తున్నారు. ఈ షో ఆయనకు ఇండియా వైడ్‌గా గుర్తింపు తీసుకురావడం విశేషం. బిజీయెస్ట్ మేకర్ గా ఉన్న కరణ్‌ జోహార్‌ కి సంబంధించిన కొన్ని విషయాలు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. 

26

కరణ్‌ జోహార్‌ తాజాగా `యాన్‌ అన్‌ సూటబుల్‌ బాయ్‌` పేరుతో బయోగ్రఫీ పుస్తకాన్ని రాశారు. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించారు. మరికొన్ని షాకింగ్‌ విషయాలను కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం అవే అభిమానులను, ఇతర సినీ వర్గాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయి. షారూఖ్‌తో సంబంధం విషయం సెన్సేషన్‌ అవుతుంది.

36

ఈ పుస్తకంలో కరణ్‌ జోహార్‌ `నేను జీవితంలో ఎన్నో నిందలు భరించాను. కానీ ఏది నన్న అంతగా బాధ పెట్టలేదు. నా దురదృష్టం కొద్దీ నాకు, షారుక్‌కు శారీరక సంబంధం అంటగట్టారు. శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదు. అది ఎవరి విషయంలోనైనా వ్యక్తిగతమే. నేను అతడితో పడుకున్నాను అంటూ వచ్చిన వార్తలు చూసి చాలా షాకయ్యాను` అని తన ఆవేదన పంచుకున్నారు కరణ్‌. 
 

46

ఓ సందర్భంలో తనకు ఇదేప్రశ్న ఎదురయ్యిందట. `ఓ టీవీ ఛానల్‌ యాంకర్‌ నేరుగా ఆ ప్రశ్నను నా ముఖం మీదే అడిగాడు. అది విని నాకు పట్టరానంత కోపం వచ్చింది. నువ్వు నీ అన్నతో పడుకుంటావా? అని అడిగాను. అందుకతడు ఏంటి? ఏమంటున్నారు? అని ప్రశ్నించాడు.నన్నసలు ఆ ప్రశ్న ఎలా అడగాలనిపించిందని ఛీ కొట్టాను. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని పుకార్లు సృష్టించినా మా మధ్య మంచి అనుబంధం ఉంది. షారుక్‌ నాకు నాన్నలాంటివాడు, ఒక అన్నలాంటివాడు. అలాంటిది మా గురించి అసహ్యంగా మాట్లాడార`ని తెలిపారు.
 

56

ఇంకా చెబుతూ, `షారుక్‌ ఎప్పుడూ ఈ పుకార్లను లెక్కచేయలేదు. 'వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. పెళ్లయ్యాక అక్రమ సంబంధం పెట్టుకోలేదంటే గే అని రాసేస్తారు. అవేం పట్టించుకోకు అని నాకు ధైర్యం చెప్పేవాడు` అని ఆ పుస్తకంలో కరణ్‌ రాసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో దుమారం రేపుతున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలే యాన్ అన్ సూటబుల్ బాయ్ బుక్ లాంచింగ్ కార్యక్రమంలో షారుక్ ఖాన్ కరణ్ జోహార్ పై ఎమోషనల్ కామెంట్స్ చేయడం విశేషం.

66

షారూఖ్‌ ఖాన్‌ 1991 డిజైనర్‌ గౌరీఖాన్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం(సుహానా ఖాన్‌, ఆర్యన్‌ఖాన్‌) ఉన్నారు. గౌరీ ఖాన్ ఇప్పుడు నిర్మాతగానూ రాణిస్తున్నారు. షారూఖ్‌, గౌరీ బాలీవుడ్‌లో ఆదర్శ జంటగా రాణిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ లైఫ్‌లో లైంగిక జీవితం సరిగా లేదు. అందుకే ఆయన మ్యారేజ్‌ కి దూరంగా ఉన్నారు. గే అంటూ కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories