ఇవి కాంతార 1 సినిమాకి ఎదురైన వివాదాలు, సమస్యలు. కానీ ఇంతటితో అంతం కాలేదు. కాంతార సినిమా ద్వారా తుళునాటి ఆరాధ్య దైవాలను అవమానిస్తున్నారని, వేషం వేసుకుని అనుకరిస్తున్నారని, వేదికలపై, రియాలిటీ షోలలో, కళాశాలల్లో దైవ నృత్యం చేస్తున్నారని, ఇది దైవారాధన, నమ్మకానికి భంగం కలిగిస్తోందని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో ఆరోపణలు వచ్చాయి. సినిమాని నిషేధించాలని డిమాండ్ కూడా వచ్చింది.