తెలుగు సినిమా పరిశ్రమలో ఇతర భాషల నటీమణులకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న హీరోయిన్లు తమ అందం, నటనతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న అగ్ర కథానాయికగా ఎదగగా, ఇప్పుడు ఆషిక రంగనాథ్, శ్రీనిధి శెట్టి, రుక్మిణి వసంత్ వంటి నటీమణులు తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరోవైపు నేహా శెట్టి, కృతి శెట్టి కూడా తమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. కన్నడ నేపథ్యం ఉన్న ఈ హీరోయిన్లు నటించిన సినిమాలు, టాలీవుడ్‌లో వారికి వచ్చిన గుర్తింపు గురించి తెలుసుకుందాం.