`బైకాట్‌ కంగనా'పై కంగనా ఫైర్‌.. వారి రహస్యాలు బయటపెడతా!

First Published | Aug 25, 2020, 8:53 PM IST

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. కొందరు `బైకాట్‌ కంగనా` పేరుతో వివాదం సృష్టిస్తున్నారు. `బైకాట్‌ కంగనా` అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో, ఆయన మరణానికి నెపోటిజం కారణమని ఆమె అనేక ఆరోపణలు, విమర్శలు చేసిన నేపథ్యంలో కంగనాని టార్గెట్‌ చేసి ఇలా చేస్తున్నారు.
తాజాగా దీనిపై కంగనా స్పందించింది. ట్విట్టర్‌లో ఆమె చెబుతూ, ఎలుకలు ఇప్పుడు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయి. నా సినీ జీవితాన్ని, ఇమేజ్‌ని నాశనం చేయాలనే ఉద్దేశంతో నా పేరుతో `బైకాట్‌ కంగనా` అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే చిత్ర పరిశ్రమలో స్టార్‌ కిడ్స్ ల ఎదుగుదల కోసమే ఇదంతాచేశారనిపిస్తుంది` అని ట్వీట్‌ చేసింది.

బాలీవుడ్‌ని మాఫియాగా అభివర్ణించిన కంగనా బాలీవుడ్‌ మాఫియా చేయగలిగిన పనులన్నీ చేస్తుందని, ఇప్పుడు నా పేరుని బ్యాన్‌ చేయాలంటూ హ్యాష్‌ను ట్యాగ్‌ను ట్రెండ్‌చేయడమే కాకుండా నా ట్విట్టర్‌ ఖాతాను కూడా తొలగించేందుకు ఈ మాఫియా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ఎవరైతే తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారో, ఆ లోపుతానే వాళ్ళ బండారాలు బయటపెడతానని, వారి అసలు రూపాలను బహిర్గతం చేస్తానని కంగనా హెచ్చరించింది.
మరోవైపు సుశాంత్‌ సింగ్‌ కేసుని తన స్వలాభం కోసం కంగనా వాడుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోనిపంచుకున్నారు. కంగనా గురించి సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ మాట్లాడుతున్న వీడియో ఇది.
మాకు కంగనపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. సినీ పరిశ్రమలోని వివక్ష గురించి కంగన పోరాటం చేస్తోంది. సుశాంత్‌ కూడా ఆ వివక్ష బాధితుడే. సుశాంత్‌ మరణానికి,బాలీవుడ్‌లోని వివక్షకు ప్రత్యక్ష సంబంధం లేదని నేను గతంలో అన్నాను. ఒకవేళ సుశాంత్‌ మరణానికి అదే కారణమైతే సీబీఐ చూసుకుంటుందని ఆయన తెలిపారు.
దీనిపై కంగనా స్పందిస్తూ, థ్యాంక్యూ శ్వేతా సింగ్‌. నా గురించి వస్తోన్న అన్ని రూమర్లకు సమాధానం చెప్పినందుకు కృతజ్ఞతలు` అని ట్వీట్‌ చేసింది.
ఈ ఏడాది `పంగా` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగనా.. ప్రస్తుతం `తలైవి`, `ధాకడ్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ రెండూ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే కావడం ఓవిశేషమైతే, `తలైవి` తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌ కావడం మరో విశేషం.

Latest Videos

click me!