బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురంచి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ప్రభాస్ సరసన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో నటించి మెప్పించింది. ఇక బాలీవుడ్ నలో వరుస చిత్రాలతో అక్కడి ఆడియెన్స్ ను అలరిస్తోంది.
చివరిగా కంగనా ‘తేజస్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఇక నెక్ట్స్ పొలిటికల్ మూవీ ‘ఎమర్జెన్సీ’ Emergency లో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటున్నారు.
ముఖ్యంగా ఆమె నెట్టింట పెట్టే పోస్టులు, ఆమె వ్యక్తపరిచే అభిప్రాయాలతో హాట్ టాపిక్ గ్గా మారుతుంటుంది. నిర్భయంగా... నిర్మొహమాటంగా తన వెర్షన్ వినిపిస్తూ సంచనలంగా మారుతోంది. ఇక తాజాగా కంగనా 12th Fail మూవీ దర్శకుడు విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) భార్యపై విరుచుకుపడింది. రీసెంట్ గా విధు వినోద్ తన భార్య అనుపమా చోప్రా (Anupama Chopra) గురించి మాట్లాడారు.
‘ట్వెల్త్ ఫెయిల్ సినిమాను థియేటర్లలో చూడరని.. ఏదైనా ఓటీటీకి 30 లక్షల వరకు విక్రయిస్తే మంచిదని.. రిలీజ్ కు ముందు సలహా ఇచ్చింది’ అని చెప్పారు. కానీ సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నటుడు విక్రాంత్ మాస్సేకు ఉత్తమ నటుడిగానూ అవార్డు దక్కింది. ఇటీవల వచ్చిన మంచి చిత్రంగానూ గుర్తింపుపొందింది.
ఇక ఈ విషయమై కంగనా స్పందిస్తూ... అనుపమా చోప్రాపై మండిపడింది. ప్రముఖ సినీ జర్నలిస్ట్ అయిన అనుపమ చోప్రా వ్యాఖ్యలకు విరుచుకుపడింది. ‘విధు సార్ భార్య అనుపమ చోప్రా సినిమా జర్నలిజం రంగానికి అప్రతిష్ట. ఆమె.. యంగ్ అండ్ తెలివైన మహిళల పట్ల తీవ్ర అసూయ, అభద్రతను కలిగి ఉంటుంది.
అలాంటామె తన స్వంత భర్త పట్ల అసూయపడటం ఆశ్చర్యమేమీ కాదు. తన వెబ్‌సైట్, ఇతర వెంచర్‌లను స్థాపించడానికి అతని పేరు, సంపద మాత్రం బాగానే ఉపయోగించుకుంటుంది. ప్రతిభ కలిగిన వారితోనూ, మంచి చిత్రాలకూ వ్యతిరేకంగా ఉండే బాలీవుడ్‌లోని గాసిప్ సర్కిల్ తో కలిసేందుకు అనుపమ బాలీవుడ్ వైఫ్ కార్డ్‌ని మాత్రం పొందింది.’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.