భార్య చనిపోయిందని తెలిస్తే ఇలాంటి రియాక్షనా.. పూనమ్ పాండే భర్త మామూలోడు కాదుగా

First Published | Feb 5, 2024, 11:06 AM IST

పూనమ్ పాండే గురించి పరిచయం అక్కర్లేదు. అనేక వివాదాలతో పాపులర్ అయిన పూనమ్ పాండే మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారింది.  నటిగా అనేక చిత్రాల్లో నటించిన పూనమ్ ఆ తర్వాత బోల్డ్ గా మారి అశ్లీల చిత్రాల్లో సైతం నటించింది.

  పూనమ్ పాండే గురించి పరిచయం అక్కర్లేదు. అనేక వివాదాలతో పాపులర్ అయిన పూనమ్ పాండే మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారింది.  నటిగా అనేక చిత్రాల్లో నటించిన పూనమ్ ఆ తర్వాత బోల్డ్ గా మారి అశ్లీల చిత్రాల్లో సైతం నటించింది. సొంతంగా యాప్ ప్రారంభించి అందులో అశ్లీల చిత్రాలు చేసింది. 2011లో టీంఇండియా వరల్డ్ కప్ వెలిస్తే నగ్నంగా వారి ముందు డ్యాన్స్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చి దేశం మొత్తం పాపులర్ అయింది. ఇలాంటి వివాదాలు పూనమ్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. 

ఇవన్నీ ఒకెత్తయితే రీసెంట్ గా ఆమె ఆడిన ఫేక్ డెత్ డ్రామా మరో ఎత్తు. తాను మరణించానని తన టీం చేస్తా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. దీనితో పూనమ్ నిజంగానే మరణించింది అనుకుని అభిమానులు.. సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం కూడా తెలిపారు. పూనమ్ పాండే సెర్వికల్ క్యాన్సర్ తో మరణించినట్లు ఫేక్ గా కట్టుకథ అల్లింది. దీనితో అసలు సెర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి.. ఎలా ఎలా సోకుతుంది అనే దానిపై దేశం మొత్తం చర్చ జరిగింది. 


ఒకరోజు గడిచిన తర్వాత పూనమ్ పాండే తాపీగా సోషల్ మీడియాలోకి వచ్చి తాను బతికే ఉన్నానని.. సెర్వికల్ క్యాన్సర్ గురించి ప్రజల్లో ఆవగాన పెంచేందుకే ఇలా చనిపోయినట్లు అబద్దం చెప్పించానని డ్రామా మొదలు పెట్టింది. దీనితో దేశం మొత్తం అభిమానులు, సెలెబ్రిటీలు పూనమ్ పాండే తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. 

క్యాన్సర్ పై అవగాహన పెంచాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ తన చావునే ఫేక్ చేసింది అంటే అది తప్పనిసారిగా చీప్ పబ్లిసిటీ కోసమే అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉండగా పూనమ్ పాండే భర్త సామ్ బాంబే ఈ మొత్తం నిర్వాకంపై తొలిసారి రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

పూనమ్ పాండే, సామ్ బాంబే గొడవల కారణంగా వేరు వేరుగా ఉంటున్నారు. కానీ ఇంతవరకు విడాకులు తీసుకోలేదు. పూనమ్ మరణ వార్త విన్నప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని సామ్ బాంబే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే ఏం జరిగినా నాకు ఎలాంటి నష్టం లేదు. ఇలాంటిది జరిగి ఉండదని.. పూనమ్ మరణించి ఉండదని తాను నమ్మినట్లు సామ్ బాంబే తెలిపారు. 

నిజంగానే ఏమైనా జరిగి ఉంటే నాకు ముందే తెలిసేది. ఆమె ఇంకా బతికి  ఉన్నందుకు సంతోషంగా ఉందని సామ్ బాంబే తెలిపారు. సెర్వికల్ క్యాన్సర్ అవగాహన కోసం పూనమ్ పాండే తన కీర్తి ప్రతిష్ఠలనే పణంగా పెట్టింది అని ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు సామ్ బాంబే తెలిపారు. 

పూనమ్, సామ్ బాంబే 2020లో వివాహం చేసుకున్నారు. అయితే ఎక్కువకాలం వీరిద్దరూ కలసి జీవించలేదు. హనీమూన్ తర్వాత తన భర్త భౌతికంగా వేధించినట్లు పూనమ్ పాండే కేసు నమోదు చేసింది. పూనమ్ కూడా తనపై దాడి చేసినట్లు సామ్ బాంబే ఆరోపించారు. 

Latest Videos

click me!