వాళ్ల వల్ల ఏడాదికి 40 కోట్లు నష్టపోతున్నాను.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..

Published : May 18, 2023, 12:57 PM IST

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది కంగనారనౌత్. ఎప్పటికప్పుడు బాలీవుడ్ మీద... బాలీవుడ్ స్టార్స్ మీద.. నెపోటిజం మీద...మండిపడుతూ.. వివాదాలు సృస్టిస్తుంటుంది కంగనా. ఇక తాజాగా మరో సారి ఫైర్ అయ్యింది బాలీవుడ్ బ్యూటీ ఏవిషయంలో అంటే..?   

PREV
16
వాళ్ల వల్ల ఏడాదికి 40 కోట్లు నష్టపోతున్నాను.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
Photo Courtesy: Instagram

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ మాఫియా అంటూ పలువురిపై విమర్శలు చేస్తుంది. ఇక దేశం, ధర్మం గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళని కూడా బహిరంగంగానే విమర్శిస్తోంది బాలీవుడ్ బ్యూటీ. ఎవరైనా కాస్త తేడాగా మాట్లాడినా..తనకు నచ్చని వాఖ్యాలు చేసినా.. ఉతికి ఆరేస్తుంది కంగనా.. సోషల్ మీడియా వేదికగానే తలంటుతుంది. ఇక తాజాగా మరోసారి ఆమె ఫైర్ అయ్యింది. ఆసక్తికర పోస్ట్ ను పెట్టింది. 
 

26

ప్రస్తుతం బీజేపీకి కాస్త దగ్గరగా ఉన్న ఈ బ్యూటీ.. హిందుత్వం గురించి మాట్లాడుతుంటుంది. సినిమాలతో బిజీగా ఉన్నా దేశంలోని పలు అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటుంది కంగనా. వాటిపై సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తుంది. తాజాగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.

36

తాజాగా ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ను ఆదర్శంగా తీసుకుంది కంగనా. నేను నాకిష్టమైందే చేస్తాను... నేను నమ్మిన దానిపై నిలబడతాను, దాని వల్ల డబ్బులు నష్టపోయినా పర్లేదు అని ఆఞన చేసిన వ్యాఖ్యలను తన స్టోరీలో జతచేసింది బ్యూటీ. తాను కూడా అంతే నని.. తను అనకున్నది చెప్పి... స్వేచ్చగా ఉంటానంటోంది. ఎలన్ మస్క్ వ్యాఖ్యలను తాను సపోర్ట్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఎందుకుంటే..

46

తాను కూడా బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం.. హిందుత్వం గురించి వ్యాతిరేకంగా మాట్లాడేవారికి కౌంటర్లు వేయడం.. రాజకీయాలు..మలినమైన మనుషుల గురించి విమర్షించడం వల్ల  అరాజకీయ నాయకులు, దేశ వ్యతిరేకులకు, రౌడీ గ్యాంగ్ గురించి మాట్లాడటం వల్ల నాకు 20 నుంచి 25 బ్రాండ్ ఎండార్స్మెంట్ లు పోయాయి అంటూ షాక్ ఇచ్చింది బ్యూటీ.  

56

రాత్రికి రాత్రే కొన్ని బ్రాండ్స్ నుంచి నన్ను తప్పించారు. కొన్ని సినిమాల నుంచి కూడా నన్ను తప్పించారు. దానివల్ల నాకు సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల నష్టం వస్తుంది. కానీ  ఆడబ్బు పోయినా.. నేను స్వేచ్ఛగా ఉన్నాను. నాకు నచ్చింది మాట్లాడుతున్నా.. నచ్చిన పనిచేస్తున్నాను. ఎవరికీ నేను బానిసను కాదు. ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడను. అసలు  భారతదేశాన్ని, దేశ సంస్కృతిని వ్యతిరేకించే మల్టీనేషనల్ కంపెనీలు, వాటి హెడ్స్ కూడా నేను చెప్పాలనుకున్నది ఆపలేరు అని అన్నారు. 
 

66

ఇక  ఈ విషయంలో నేను ఎలాన్ ని అభినందిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది. కనీసం డబ్బు ఉన్నవాళ్ళైనా డబ్బుల గురించి పట్టించుకోకూడదు. ఎక్కువ డబ్బు ఉన్నవాళ్లే ఎక్కువ కోల్పోతారు అని కంగనా రాసింది. దీంతో మరోసారి కంగనా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కంగనా వివాదాలతో ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు తగ్గిపోయాయి. సౌత్ లో సినిమాలు చేస్తుంది బ్యూటీ. తానే నిర్మాతగా.. దర్శకురాలిగా మారి కొన్ని సినిమాలు తెరకెక్కించింది కంగనా. 

Read more Photos on
click me!

Recommended Stories