చెప్పిన వినే పరిస్థితుల్లో లేరు నీ చెల్లెలు నీ గురించి అంత బాడ్ గా ఇంట్లో చెప్పింది. అసలు ఆ ఇంట్లో పెద్ద శత్రువు నీ చెల్లెలే అంటూ కావ్య మీద లేనిపోనివి చెప్తాడు రాహుల్. మరోవైపు కోడలు పెట్టిన టిఫిన్ తింటూ ఆ టిఫిన్ ని తెగ మెచ్చుకుంటారు సుభాష్, అతని తమ్ముడు. నువ్వు కాంప్లిమెంట్స్ ఇవ్వవా అని రాజ్ ని అడుగుతాడు సుభాష్. అంతలోనే డిజైనర్ ఇందాక కావ్య సరిచేసిన డిజైన్ ని తీసుకొని వస్తుంది.అది చూసిన రాజ్ ఇంప్రెస్ అవుతాడు.