కంగనా ‘ఎమర్జెన్సీ’ఆ దేశంలో బ్యాన్, ఎందుకంటే

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బంగ్లాదేశ్‌లో నిషేధం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు పడ్డ  కంగనా రనౌత్‌ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. రిలీజ్ కు ముందు నుంచి ఎన్నో వివాదాలు మోసుకొచ్చి ఎట్టకేలకు థియేటర్ లో దిగుతోంది.  మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఈ జనవరి 17న విడుదల కానుంది.  అయితే ఈ సినిమా రిలీజ్  కాకుండానే కొన్ని చోట్ల  బ్యాన్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భం ఆధారంగా రూపొందిందీ   ‘ఎమర్జెన్సీ’ (Emergency). పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీసు ముందుకు రానుంది.

మరోవైపు, ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం యోచించినట్టు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలను నిషేధిస్తున్నట్టు సమాచారం. 
 


Kangana Ranaut upcoming Bollywood film Emergency

కంటెంట్‌ పరంగా కంటే ప్రస్తుత పరిణామాల ప్రభావం కారణంగానే బ్యాన్‌ చేస్తున్నట్టు నేషనల్‌ మీడియా పేర్కొంది.   ప్రమోషన్ మెటీరియల్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఓ వర్గం సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది.

దాంతో, సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకి సంబంధించి పలు సన్నివేశాల్లో కొన్నాళ్ల క్రితం అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్‌ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయని, తమ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదంటూ కంగన అప్పుడు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సెన్సార్‌ పూర్తి చేసుకున్న చిత్రం మరికొన్ని రోజుల్లో రానుంది.  

కంగనా మాట్లాడుతూ.. ‘ ఎమర్జెన్సీ టైమ్‌లో పరిస్థితులపై ఈ సినిమా తీశాం. సెన్సార్ చాలా పరిశీలన చేసింది, చరిత్రకారులను నియమించి.. ప్రతి ఒక సీన్ ను క్షుణంగా పరిశీలించింది. దీంతో మేము వాటికి ఆధారాలు ఇవ్వాల్సి వచ్చింది. అలా 6 నెలల పోరాటం తర్వాత థియేటర్స్‌లోకి వస్తోంది’ అని తెలిపింది.  

ఇందిరా గాంధీగా కంగనా నటించగా.. జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు.

  తాజాగా నాగ్‌పూర్‌లో ‘ఎమర్జెన్సీ’ స్పెషల్ షోను ప్రదర్శించారు. వీక్షించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నటుడు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్‌ తో పాటుగా, ఎమర్జెన్సీ టైమ్‌లో  జైలు శిక్ష అనుభవించిన అప్పటి కార్మికులందరిని  ఆహ్యానించారు.

 ఇందులో భాగంగా సినిమా చూసిన నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..‘ సినిమా మొదటిసారి చూస్తున్నాను. ఈ ఎమర్జెన్సీ టైమ్‌ కష్టాలు ఎదుర్కొన్న కొంతమందిని నేను పిలిచాను.మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయానికి ఇంత ప్రామాణికతతో అందించినందుకు చిత్ర నిర్మాతలు, నటీనటులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. 

read more: జైలర్ 2 టీజర్.. రజనీ బ్లాక్‌ బస్టర్‌ కాంబో లోడింగ్‌.. త్రివిక్రమ్ ఇక రిలాక్స్

also read: నిహారిక సినిమాని దెబ్బకొట్టిన అరుణ్‌ విజయ్‌.. `వణంగాన్` నాలుగు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు

Latest Videos

click me!