ఎపిసోడ్ ప్రారంభంలో భర్తని తనతో పాటు ఇంట్లోకి రమ్మంటుంది కావ్య. ఆఫీస్ లో మీటింగ్ ఉంది కుదరదు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. డ్రాప్ చేసినందుకు భర్తకి థాంక్స్ చెప్తుంది కావ్య. మరోవైపు దిగులుగా కూర్చున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఏమీ తెలియని దానిలాగా ఏం జరిగింది? ఎందుకలా కూర్చున్నావు నిన్ను ఎవరు బాధపెట్టారు అని అడుగుతుంది రుద్రాణి.