Anasuya: నా భర్త ప్లేస్ లో ఇలాంటి వాడిని పెట్టారేంటి.. లబోదిబోమన్న అనసూయ

Published : Jun 12, 2022, 07:43 AM IST

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

PREV
16
Anasuya: నా భర్త ప్లేస్ లో ఇలాంటి వాడిని పెట్టారేంటి.. లబోదిబోమన్న అనసూయ

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

26

అనసూయ బులితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడంలో, ఎంటర్టైన్ చేయడంలో తన వంతు కృషి చేస్తుంది.  తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. రైసింగ్ రాజు, దొరబాబు మరికొందరు కమెడియన్లు కలసి చేసిన స్కిట్ వైరల్ అవుతోంది. 

36

ఈ స్కిట్ లో సెలెబ్రిటీల హోమ్ టూర్ ప్లాన్ చేస్తారు. హోమ్ టూర్ లో భాగంగా అనసూయ ఇంటికి వెళతారు. ఈ స్కిట్ లో అనసూయ రోల్ లో రైజింగ్ రాజు నవ్వులు పూయిస్తున్నాడు. ఇక అనసూయ భర్త పాత్రలో దొరబాబు నటించడం విశేషం. తన భర్త పాత్రలో దొరబాబుని పెట్టడంతో అనసూయ సరదాగా లబోదిబో మంటోంది. 

46

రాముడు లాంటి నా భర్త పాత్రలో దొరబాబుని పెట్టారేంటి అని అంటోంది. ఈ స్కిట్ ఆపక పోతే వైలెన్స్ జరుగుతుంది అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చింది. దొరబాబు చాలా రోజుల క్రితం ఓ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హైపర్ అది కూడా దొరబాబుపై వరుసగా జోకులు వేస్తూనే ఉన్నాడు. 

56

ఈ ఎపిసోడ్ జూన్ 16న ప్రసారం కానుంది. ఈ ఎపిపోడ్ లో మరో విశేషం కూడా ఉంది. యువ నటుడు, హీరో సత్యదేవ్ జబర్దస్త్ కి అతిథిగా హాజరయ్యాడు. తాను నటిస్తున్న గాడ్సే చిత్ర ప్రచారంలో భాగంగా సత్యదేవ్ జబర్దస్త్ షోకి హాజరయ్యాడు. 

66

ఇటీవల విడుదలైన గాడ్సే ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం జూన్ 17న రిలీజ్ కి రెడీ అవుతోంది. నటుడు సత్యదేవ్ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. గాడ్సే చిత్రంలో అవినీతిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

click me!

Recommended Stories