అప్పుడు సోహైల్-మెహబూబ్, ఇప్పుడు శివాజీ-కెన్నీ... కోడ్ లాంగ్వేజ్ తో కీలక విషయం లీక్!

Published : Nov 08, 2023, 05:35 PM ISTUpdated : Nov 08, 2023, 05:39 PM IST

బిగ్ బాస్ హౌస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివాజీ-కెన్నీ మధ్య సీక్రెట్ సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది. కోడ్ లాంగ్వేజ్ లో కెన్నీ కీలక సమాచారం లీక్ చేశాడని అంటున్నారు.   

PREV
17
అప్పుడు సోహైల్-మెహబూబ్, ఇప్పుడు శివాజీ-కెన్నీ... కోడ్ లాంగ్వేజ్ తో కీలక విషయం లీక్!
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్స్ లో ఒకరైన సోహైల్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫైనల్ వీక్ కి ముందు వారం ఎలిమినేటైన కొందరు కంటెస్టెంట్స్ హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అపుడు కోవిడ్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో హౌస్ మేట్స్ ని బయట నుండి వచ్చిన వారు నేరుగా కలవకుండా గ్లాస్ ఉంచారు. 
 

27

గ్లాస్ అవతలి నుండే హౌస్ మేట్స్ తో మాట్లాడారు. మెహబూబ్-సోహైల్ హౌస్లో క్లోజ్ ఫ్రెండ్స్ గా మెలిగారు. ఈ క్రమంలో బయట నుండి వచ్చిన మెహబూబ్ సోహైల్ తో మాట్లాడుతూ అద్దం మీద అనుమానాస్పదంగా వేళ్ళు కదిలించాడు. ఫైనల్ లో సోహైల్ నాగార్జున ఆఫర్ చేసిన డబ్బు తీసుకుని నిష్క్రమించాడు. 

 

37
Bigg Boss Telugu 7

మెహబూబ్ నీది మూడో స్థానం అని కోడ్ లాంగ్వేజ్ లో సోహైల్ కి చెప్పడం వలనే సోహైల్ తెలివిగా డబ్బులు తీసుకున్నాడన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ విమర్శలను సోహైల్ ఖండించాడు. ఇదే తరహా ఆరోపణలు ప్రస్తుతం శివాజీ-కెన్నీ ఎదుర్కొంటున్నారు. 

47
Bigg Boss Telugu 7


ఫ్యామిలీ వీక్ నేపథ్యంలో శివాజిని కలిసేందుకు పెద్ద కొడుకు కెన్నీ వచ్చాడు. కెన్నీని చూసిన శివాజీ ఎమోషనల్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్, యావర్ లకు కెన్నీ కృతజ్ఞతలు చెప్పాడు. భుజానికి గాయమైనప్పుడు మీరిద్దరూ నాన్నను బాగా చూసుకున్నారని వారితో అన్నాడు. 
 

57
Bigg Boss Telugu 7

తర్వాత ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. ఎవరు రెచ్చగొట్టినా ఓవర్ గా రియాక్ట్ అవ్వొద్దు. రానున్న ఫైనల్ వీక్స్ లో మరింత రెచ్చగొడతారని కెన్నీ తండ్రికి సలహా ఇచ్చాడు. ఈ సంభాషణ జరుగుతుండగా... కెన్నీ చేతిని శివాజీ వేలితో గోకాడు. కెన్నీ తండ్రి తొడపై చేయి వేసి ఏదో రాసినట్లుగా ఉంది. శివాజీ గోకడాన్ని బిగ్ బాస్ హౌస్లోని కెమెరాలు హైలెట్ చేశాయి. 
 

67
Bigg Boss Telugu 7


ఈ క్రమంలో శివాజీ-కెన్నీ కోడ్ లాంగ్వేజ్ లో ఏదో మాట్లాడుకున్నారు. బహుశా విన్నర్ ఎవరు? బయట టాక్ ఏంటి? అని లీక్ చేసి ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 
 

77
Bigg Boss Telugu 7

ఈ పది వారాల గేమ్ ప్రకారం శివాజీ టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అమర్, ప్రియాంక, గౌతమ్ టాప్ 5లో ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. టాప్ లో నువ్వు నీకు పోటీ పల్లవి ప్రశాంత్ అనేది కూడా కెన్నీ లీక్ చేసి ఉండొచ్చు. వీరి సీక్రెట్ సంభాషణలో ఎంత వరకు నిజం ఉందో కానీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది... 
 

click me!

Recommended Stories