కర్ణాటకలో 'థగ్ లైఫ్' మూవీ బ్యాన్ అయితే కమల్ హాసన్ కి ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ?

Published : May 30, 2025, 11:58 AM IST

కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే కమల్ హాసన్ కి ఎంత నష్టం వస్తుందో ఇప్పుడు చూద్దాం. 

PREV
14
కర్ణాటకలో థగ్ లైఫ్ బ్యాన్ ?

కన్నడ భాష తమిళ భాష నుండి ఉద్భవించిందని కమల్ హాసన్ చెప్పడంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. శుక్రవారం లోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే 'థగ్ లైఫ్' సినిమాని కర్ణాటకలో విడుదల చేయమని కన్నడ చిత్ర పరిశ్రమ హెచ్చరించింది.

24
ఎలా విడుదల చేస్తారో చూస్తాం

కర్ణాటక ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత సా.రా. గోవిందు మీడియాతో మాట్లాడుతూ, 'కమల్ హాసన్ మొండిగా బిహేవ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకుండా ఇక్కడ సినిమా ఎలా విడుదల చేస్తారో చూస్తాం. పంపిణీదారులు మాకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నాం. కమల్ పై ఎలాంటి జాలి లేదు' అని అన్నారు.

34
కమల్ వైఖరిపై విమర్శలు

ఇప్పటికే కన్నడ సంఘాలు, కన్నడ అభివృద్ధి సంస్థ కమల్ వైఖరిని ఖండించాయి. 'అతను క్షమాపణ చెప్పకపోతే అతని సినిమా విడుదల కాదు. తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో చూద్దాం' అని అన్నారు.

44
థగ్ లైఫ్ సినిమాకి ఎంత నష్టం?

కమల్ హాసన్ క్షమాపణ చెప్పే ఉద్దేశంలో లేరు. దీంతో థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో విడుదలయ్యే అవకాశాలు తక్కువ. కర్ణాటకలో సినిమా రిలీజ్ కాకపోతే కమల్ కి 20 కోట్ల వరకు నష్టం రావచ్చు అని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలలో కమల్ హాసన్ కూడా ఒకరు.

Read more Photos on
click me!

Recommended Stories