సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. 2005లో విడుదలైన ఈ సినిమా, కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ విజయాన్ని సాధించింది. పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రంలో నయనతార, జ్యోతిక, ప్రభు, వడివేలు, వినీత్, నాసర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.