రాజమౌళి భార్య రమాకి రాజమౌళి రెండో భర్త అనే విషయం అందరికి తెలిసిందే. రమాకి పెళ్లయి కార్తికేయ పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రాజమౌళి, రమా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీయగా ఇందులో రమా తమ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా దీని గురించి మాట్లాడాడు.