అల్లు వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్రావు దర్శకత్వంలో రూపొందిన `గంగోత్రి` చిత్రంతో ఆయన టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అయ్యారు. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో బన్నీ తొలిసినిమాకి స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా ఆయన ఎంట్రీ జరిగింది. 2003లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. బన్నీ ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది.
అయితే ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో జరిగిన సంఘటన బయటపెట్టాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సినిమా చూసిన కొంత మంది చెప్పిన మాట, అలాగే అల్లు అరవింద్ అన్న మాటలను వెల్లడించారు. ఎంతటి షాకిచ్చే సంఘటన చోటు చేసుకుందో వెల్లడించారు. రాఘవేంద్రరావు చెబుతూ, సినిమా షూటింగ్ అయిపోయింది. అల్లు అరవింద్ నాపై నమ్మకంతో బన్నీ బాధ్యతలు నాపై పెట్టారు. తేడా వస్తే బాగోదని చెప్పి ముందే కొందరికి సినిమాని చూపించాడట.
సినిమా చూసిన వాళ్లు.. బాగా రాలేదని చెప్పారట. అంతేకాదు ఈ మూవీరిలీజ్ అయితే బన్నీ కెరీర్ అయిపోయినట్టే అన్నారట. దీంతో కూల్‌గా ఉండే రాఘవేంద్రరావు సైతం వారి మాటలకు కుంగిపోయాడట. ఇంతలోన అల్లు అరవింద్ వచ్చి.. సినిమా చూశాం, నచ్చలేదు. దీన్ని అలానే గోదాంలో పడేద్దాం. ఈ సినిమాని రిలీజ్ చేయద్దని చెప్పారట. దీంతో రాఘవేంద్రరావు మరింతగా ఆందోళనకు గురయ్యాడు. ఏంటీ ఇలా అంటున్నారని ఆలోచించి మళ్లీ వాళ్ల అందరిని కూర్చోబెట్టి కథ చెప్పాడు.
సినిమా చేయడానికి ముందు తాను ఏదైతే కథచెప్పాడో అదే మళ్లీ చెప్పాడట. మీరు చెప్పినప్పుడు బాగుంది, కానీ తెరపై చూసినప్పుడు అలా అనిపించడం లేదన్నారట. అయితే ఫైనల్ మిక్సింగ్ అయ్యాక సినిమాని డైరెక్ట్ గా థియేటర్లో విడుదల చేశారు. దీంతో పెద్ద హిట్ అయ్యింది. అయితేఅల్లు అరవింద్, ఆ రోజు అన్నమాటలకు నేను బాధపడి, కుంగిపోయి ఏదేదో చేస్తే సినిమా రిలీజ్ అయ్యేది కాదు, నా వందవ సినిమా ఉండేద కాదు, బన్నీ `గంగోత్రి`తో హీరోగా పరిచయం అయ్యేవాడు కాదు అని చెప్పారు రాఘవేంద్రరావు.
సౌందర్య లహరి కార్యక్రమంలో గంగోత్రి గురించి చర్చ జరిగింది. ఇందులో బన్నీ, దిల్ రాజు, ఛోటా కె నాయుడు వంటి వారు పాల్గొన్నారు. సినిమా గురించి చర్చించారు. ఈ క్రమంలో `గంగోత్రి` సినిమా రిలీజ్‌కి ముందు జరిగిన ఘటన పంచుకున్నారు రాఘవేంద్రరావు. వాళ్లు చెప్పినట్టు చేస్తే నాకు వందవ మూవీ ఉండేది కాదన్నారు. రాఘవేంద్రరావుకిది వందవ మూవీ కావడం విశేషం. అయితే వంద సినిమాలు చేసిన తనకు ప్రతి మూవీ ఒక లెసన్ అని, వంద సినిమాలు చేసినా ఇంకా తాను స్టూడెంట్‌నే అని ఈ సందర్భంగా తాను తెలుసుకున్నట్టు తెలిపారు రాఘవేంద్రరావు.